పది సంవత్సరముల క్రితం నేను GLN శాస్త్రిగారి రాసిన ‘సౌందర్యలహరి’ వివరణ మొట్టమొదట చదివాను. నాకది చాలా నచ్చిన వివరణ. వారి శైలి అరటిపండు వలచి నోట్లో పెట్టినట్లుగా వుంటుంది. మనం గుటుక్కుమనటమే తరువాయి. అంతటి సవివరముల వివరణ లలిత కు కూడా వారు రాశారని తెలుసుకొని చాలా సంవత్సరాలు వెతికి దొరకపుచ్చుకొని మొదలెట్టాను.
ప్రారంభించటము నేనే చేసినా, క్రమం తప్పక నడుపుతున్నది మాత్రం ఆ జగదంబనే. అది ఎన్నో సందర్భలలో నాకు రుజువవుతున్న సత్యం.
నేటికి 335 రోజులుగా అనుదినము గురువును స్మరించి లలితా నామ భాష్యాలు పంచుకుంటున్నా
ఆ భాష్యాల రాసిన శ్రీ GLN శాస్త్రి గారిని మాత్రం ముఖతా కలవలేదు.
వారి అనుమతి తీసుకోలేదని నాకు గొప్ప అసౌకర్యం వుంది మనసులో.
ఇవి మొదలెట్టినప్పుడు అట్లాంటాలో వున్నాను. అందువల్ల ముందుగా అనుమతి తీసుకొన వీలు కలగలేదు. ఈ సారి ఇండియా ట్రిప్పులో వారిని తప్పక కలవాలని ముందే అనుకున్నాను.
ఇప్పుడు ఇండియా వచ్చాను. వారిని కలవాలని చాలా ఆత్రపడ్డా, కానీ ఎక్కడ వుంటారో ముందు వివరాలు తెలియలేదు. అమ్మను ప్రార్దిస్తే దానికీ అమ్మవారే దారి చూపారు. ‘నరసింహ శాస్త్రి మంత్రాల’ నా మిత్రులలో వున్నారు. ఆయన శాస్త్రి గారి మేనల్లుడు. వారు నాకు శాస్త్రి గారి ఫోను నెంబరు ఇచ్చారు. నేను అలా శాస్త్రి గారితో మొదట మాట్లాడ గలిగాను. చివరకు నిన్న వారిని ప్రత్యక్షంగా కలుసుకోగలిగాను.
వారు గుంటురూ లో వుంటారు. హిందూ కాలేజీలో ఫిజిక్స్ dept లో పనిచేసి ఇప్పుడు రిటైర్డ్ జీవితం , ఉచిత హెమియో వైద్యశాలను నడుపుతూ, ప్రశాంతమైన వానప్రస్థపు జీవితం గడుపుతున్నారు.
వారింటికి నన్ను ఎంతో ఆదరంగా ఆహ్వానించారు. ఎన్నో సంగతులు, అమ్మవారి విషయాలు పంచుకున్నారు.
నేను వారిని ‘మీరు బాలా వుపాసన చెస్తారా?’ అని అడిగితే, అసలు ఉపాసన అన్న మాట వాడవద్దన్నారు. “బాల మా ఇంట పరంపరగా వున్నది’ అన్నారు. “పంచదశి, షోదశి,నవావరణ విధితో పూజ ప్రతి వుదయం వారింట వుంటుందని” చెప్పారు.
‘వారి నాయనమ్మగారు కాశీ లో విశాలాక్షి కి జోల పాడారట ఒక తడవ. వారి పెద్దమ్మ గారు కాశీ వెళ్ళినప్పుడు మేలుకొలుపు పాడారట. అమ్మ ఆవిడతో “ఇన్ని రోజులా నన్ను నిద్ర పుచ్చేది.” అని అడిగినదట. ‘దేవతలు పలుకుతారు మనం పిలిస్తే. మనకు ఆ నమ్మకము, నిబద్ధత వుండాలి’ అని చెప్పారు.
‘నీ కెమ్మన్నా కష్టం వుందా అమ్మా? జీవితములో’ అని నన్ను అడిగారు!
నా గురించి, నా ఈ జన్మకు గల కారణం గురించి తెలుసుకోవాలన్న నా కోరిక నన్ను నిలవనీయటం లేదని’ చెబితే తేలుకగా నవ్వి, జగదంబ ను కొలుచుటనే అంటూ చిక్కుముడి చిటపక్కున విడదీశారు.
వారి శ్రీమతి మీనాక్షి గారు వారికి సరిజోడు. వీరు చేసిన రచనలను చెబుతూ వుంటే, ఆమే రాసినారట.
వారిరువురికి గురువులు శ్రీ ఎక్విరాల కృష్ణమాచార్యులవారే. వీరిరువురు పార్వతీ పరమేశులే. దాంపత్యం ఎలా వుండాలో చూపిన పుణ్య దంపతులు.
శాస్త్రి గారు ఎన్నో విషయాలను వివరించారు. అందులో జాగ్రుత్,నిద్ర, స్వప్నా, తుర్యావస్తలు. నేను అడిగిన మీద “పరా, పశ్యంతీ,మధ్యమా, వైఖరీ’ ల గురించి వివరించారు.
సుబ్రమణ్య ఆరాదన, కుండలినీ awakenings ఒకటేనని వివరించారు.
వారికి నేను రాసిన పద్యాలు చూపిస్తే “బావున్నాయి-ఇలానే రాయి అమ్మ రాయిస్తుంది నీ చేత” అని దీవించారు.
నేను ఈ నామాలు పంచుకుంటున్న మొదట్టో, నా మిత్రులు కొందరు నాకు కాఫీరైటు ఇష్యు ల గురించి హెచ్చరించారు. నేను ప్రతి రోజు నా decliner తో కలిపి పంచుతున్నందున అలాంటిది వచ్చే అవకాశము లేదని వివరించినా ఆయనతో ఒక సారి మాట్టాడలేదని ‘ చాలా గిల్ట్ వుండేది. ఈ విషయము గురించి మీనాక్షి గారు మాట్లాడుతూ వారికి ఎవరో చెప్పారుట, మీ పుస్తకాల విషయం ఇంటరునెట్ లో వుంచుతున్నారని’. దానికి శాస్త్రి గారు ‘పెట్టనీ. అది నలుగురికి అందాలనే రాశాము. వళ్ళో దాచుకోవటానికి కాదు’ అని చెప్పిన వారిని పెద్దగా పట్టించుకోలేదని, అన్నారు.
శాస్త్రి గారు ఆదరంతో వారు రాసిన అన్నీ పుస్తకాలు చదవమని, నచ్చినవి తోచినవి నలుగురికి పంచమని ప్రొత్సహించారు.
‘తైతోపనిషత్’ శివానందలహరి’ తప్పక చదవమని సలహా ఇచ్చారు.
ఇంకా ఎమైనా చెప్పమంటే WATCH గుర్తుపెట్టుకో చాలు అన్నారు. వాచు అంటే వివరిస్తూ: watch your Words, Action, Time, Character, Heart.
‘Time మరీ ముఖ్యమైనది. మళ్ళీ రాదు. కాబట్టి అసలు వృధా చెయ్యకు’ అన్నారు.
చేతనయ్యినంత ప్రక్కవారి కి ఉపయోగపడె పని చెయ్యమని, అలాంటి పనులలో నే జగదంబ వుందని చెప్పారు. వారు రాసిన పుస్తకాలు నా వద్ద లేనివి అన్నీ బొత్తిగా తెచ్చి నాకిచ్చారు. నేను వారికి, మీనాక్షి గారికి బట్టలు, పళ్ళు గురుదక్షిణ సమర్పించి వందనమాచరిస్తే “అనంతమైన ఆనందములో సదా మునిగి వుండమని సంపూర్ణమైన దీవెన” నిచ్చారు.
శాస్త్రీగారు, మీనాక్షీ గారు నన్ను వారి కుమార్తే గా ఆదరించారు.
వారింట అణువణులో అమ్మ ఆనవాలు నాకు కనిపించాయి. వారి దేవతార్చనలో బాలాంబ స్వయంగా వున్నట్లు వుంది. ఆహ్లాదకరంగా, ఎంతో ప్రశాంతముగా అనిపించింది అక్కడ్నుంచి వస్తుంటే.
ఎవరికైనా అమ్మవారి పుస్తకాలు కావాలంటే స్వయంగా శ్రీ శాస్త్రి గారి ని సంప్రదించవచ్చు. ( i can share phone number in msg )




