ఆధునిక సత్రాలు-AIRBNB లో అతిధ్యం –

ఆధునిక సత్రాలు-AIRBNB లో అతిధ్యం – పూర్వం చందమామ కథలలో మనందరము చదువుకున్నాము కదండి సత్రాల గురించి. అదే నేటి ఆధునిక ముసుగేల కున్న airbnb. వివరాలలోకి వెళ్ళిపోయ్యామంటే – మేము మా అమ్మాయి గ్రాడ్యుయేషన్ కు వెళ్ళాలన్నప్పుడు ఐదు నెలల ముందుగా హోటల్ బుక్ చేసుకునే ప్రయత్నం చేశాము. అసలు మామూలుగానే డౌన్-టౌన్ లోని హోటల్స్ లో ముఖ్యమైన రోజులలో కిటకిటలు, ఆకాశానికి ధరలు సర్వ సాధారమైన విషయం. ఈ నాలుగు సంవత్సరాలలో చూసినదేమంటే, క్యాంపస్…

స్వరాంజలి

ఉచ్శ్వాస నిశ్వాసల హంసను ఎక్కి మనఃఫలకమున మంజుల వాణివి జ్ఞానవాహినివి నీవు మాతా! మూలాధారమున ‘ష్డజమ’ రూపపు మొగ్గవు అనాహతం మీద ‘మద్యమ’మై, విశుద్ధ లోన ‘పంచమ’ముగా పవళించి సహస్రారమున ‘నిషాద’మైన నిలుచిన  స్వరరాగ మాధురివి సరిగమలతో  హంస ప్రయాణం సరస్వతికి స్వరాభిషేకం నిలిపిన  నిశ్చలముగా హంసను నిలుపును జీవిని,నీరాజనంబు నొసగగ సంగీతారాధనము జ్ఞానేశ్వరికి జరిపిన మోక్షమునకు కది కదా సుగమము సుమధుర కచ్ఛపి నాధమును హృదయమున పలికించి, హంసను అనుసంధానించి అర్చింపు సాదనకు జీవితము పండించు…

చెలియలి కట్ట 

ఊరు వాడ, పుట్ట, చెట్టు, వాన వరదై ఉప్పొంగుతున్నాయి చలికి మెల్లగా పిల్ల గాలులు నెమ్మదిగా బరువుగా ఈ గదిలో తెలియని భయాలు కనపడని గోడలు వికటంగా నవ్వుతున్నాయి సాధన భాదను వేదన మాతృ వేదన, మరణ వేదన మానసిక వేదన నీరవ నిర్జీవ ఉదయాలు ఏ అంబికా దర్బారు బత్తి వెలిగించి జీవం ఇవ్వాలి దోమలు చీమలు చుట్టూ అలుముకుంటున్నాయి పేలు ప్రవహిస్తున్నాయి వాడ బడుతున్నాను సోపు లా – ఒక ఆడ సోపులా మగ…

స్నాతకోత్సవ సరిగమలు – పరుగుల పదనిసలు 

#అక్కడ – ఇక్కడ మే,జూన్ లలో ఎక్కడ చూసినా గ్రాడ్యుయేషన్స్ లు, పిల్లలతో పెద్దల పరుగుల లుకలుకలు, పిల్లల పకపకలు కనబడుతాయి. ఐదవ తరగతి నుంచి రిసెర్చ్ వారు వరకూ. ఇక్కడ, అంటే అమెరికాలో, ఈ గ్రాడ్యుయేషన్ అన్న మాటకి విలువ ఎలా ఇవ్వాలో నాకైతే ఇప్పటివరకు అర్థం కాలేదంటే నమ్మాలి. ఎందుకంటే, మేము చదువుకునే రోజులలో, 90’s లో అన్నమాట, మాకు డిగ్రీ అయ్యాక ఒకటో రెండో సంవత్సరాలు గడిచాక నాలుగు బాచ్లల వారికీ కలిపి…

sandwich

sandwich – చిన్నప్పుడు మడి గురించి చాలా విప్లవం జరిపినా నా ధర్మపోరాటము లో నేను ప్రతిసారి “ఘోరంగా” ఓడిపోయేదాన్ని మా నాయనమ్మ చేతిలో. నా ఉదేశ్యం ‘మడి’ అన్నది శుభ్రం కోసం మొదలుపెట్టి ఉంటారు. ఆ రోజులలో పాడి – పంట, గొడ్లు – గోడా, సర్వం అక్కడే ఉండేది కదా! గచ్చు నెలలు కూడా ఉండేవి కావు కదండీ. మట్టితో అలికిన వంటగదులు, చేతులతో సమస్తం తాకటం ఉండేదేమో, అందుకే అన్నం ముట్టుకున్నా, వండినవి…

అమ్మా నిన్ను తలచి…..

అమ్మా నిన్ను తలచి….. అమ్మను తలుచుకోవటానికి నాకు ప్రత్యేకంగా ఒక రోజు అవసరములేదు. ప్రతి రోజూ ఏదో క్షణంలో ఏదో ఒక విషయములో గుర్తుచేసుకుంటునే వుంటాను. అమ్మ వస్తుందంటే ముందు మెట్టెలు కలిసిన మెత్తని అడుగుల సవ్వడి,  మెల్లని గలగలలు గాజులు సవ్వడి, నా హృదయంలో చిరుగంటలలా వినిపిస్తూనే వుంటాయి. అమ్మ గుంటూరు నేత చీరలు ఎక్కువగా కట్టుకునేది. మెత్తని ఆమె చీర కొంగు ఎన్ని సార్లు నాకు చలి తగలకూడదని కప్పిందో. బోంచేశాక అమ్మ కొంగుతో…

ఇది సమయము

ఆడపిల్లలను బ్రతకనియ్యటం లేదంటే, వాళ్ళను హింసించి చంపుతున్నారురా దేవుడా,  అంటే ముస్లీమా? హిందువా? అంటారు, అక్కడ ఒక ప్రాణమురా……. అది సరిగ్గా చూడండి! ఒక ఆడ పిల్లని ఆడపిల్లగా చూడండి! హిందువా, ముస్లిమా అని కాదు…. బలవంతులు బలహీనులను- చెరుస్తున్న దుర్ముహుర్తమిది। చెదపట్టిన న్యాయాలు, కులమతాల రొచ్చులలో స్త్రీ జాతికి వుచ్చులు తొడిగి పాత బంధాల మీద క్రొంగొత్త ఆంక్షలు తొడిగి అంగట్లో అమ్మేస్తుంటే… ఎక్కడుంది ప్రాణం విలువ? ఎక్కడుంది మానము విలువ? కలియుగమున ధర్మం నాల్గవ…

Avakai

ప్రతి వేసవిలో పెద్ద ముతైదువలా ప్రతి తెలుగువారు గడపను పావనము చేసి వారి ఆలనా పాలనలో ప్రధమ సహయాకారి, అందరి ప్రియతమ అవకాయ ను అందరు స్వాగతించ సన్నాహాలు జరుపుతున్నారుగా. బాగు!బాగు! మేము మీ అంత పకడ్బందీగా కాకపోయినా కొద్దిగ ముక్కల పచ్చడి, మెంతిబద్దలు గట్రా చేసి ఆనందిస్తున్నామన్నమాట. ముందు ఘనస్వాగతము పలికాను, షాపులో మామిడికాయలు కనపడగానే… గౌరవముగా తీసుకొచ్చి ఇంటికి రాగానే.. శుద్దోదక సాన్నం సమర్పయామి యని, శుభ్రముగా కడిగాను. వస్త్రం సమర్పయాని, తుడిచాను మెత్తని…

గరాజ్ సేల్ – పనికిరాని సంపద

  మనం సెకండ్ హ్యాండ్ లో సామాను మాములుగా ఏది కొనము,వాడము, ఒక్క పుస్తకాలు తప్ప. ఇండియాలో అందునా హైదరాబాద్ లో సెకండ్ హ్యండు బుక్స్ కి మంచి గిరాకీ. పుస్తకాలు తప్ప మనం సెకండ్ హ్యాండ్ వస్తువులు ఎంత కొత్తగా, నాణ్యంగా, మన్నికగా వున్నా కొనటము, వాడటము ఎంతో చిన్నతనంగా భావిస్తాము. మీదుమిక్కిలి మన గౌరవానికి భంగం కూడాను అన్న నమ్మకము మన రక్తంలో జీర్ణించుకుపోయ్యింది. నా చిన్నప్పుడు అక్క బుక్స్ నాకు బట్వాడా అయ్యేవి….

అభినవ అక్షయపాత్ర – సమాన హక్కు

అమ్మా, నాన్నగారు మమ్ములను అందరిని తేడా లేకుండా ముద్దు చేసేవారు.. కానీ మా నాయనమ్మ మాత్రం తమ్ముడిని ఎక్కువ ముద్దు చేసేది.  ఒక్క విషయములో ఇంట్లో రామ-రావణ యుద్దము నడిచేది, నానమ్మకు నాకు మధ్య. ఆ విషయము ఏంటంటే….. ముద్దపప్పు. అవునండి. పప్పే. ముద్దపప్పు. ఉట్టి పప్పు అని కూడా అంటారు. అది ఎలాగంటే …  ఇంట్లో ఏ నెలకో ఒక్కసారి మాత్రమే ముద్దపప్పు, పులుసు కాంబినేషన్ చేసేవారు, మిగితా రోజులలో ఆకుకూర పప్పు వండేవారు. పిల్లలకి…