వాణిని నమ్మితి మృదుల గీతోత్పల మంజుల మృందగ సుశీల నాద విపంచి రవముల గానము చెయ్యగ వాణిని నమ్మితి సుమనోహర దృతుల సుశిత గంభీర ఝరుల కవనము రచియింపగ వాణిని నమ్మితి మోహన సావేరి పున్నాగవరాళి, సింధుభైరవి, తోడి లలో మృధు మధుర రాగాలాపనలతో వీణను మీటగ వాణిని నమ్మితి ప్రాక్దిశన వెలుగు బాలారుణ భాస్కర సుప్రకాశ జ్యోతుల యందు అమ్మను దర్శించి ప్రార్థన సేయ్యగ వాణిని నమ్మితి సకల చరాచరములలో జాగ్రుత్, స్వప్న, సుషుప్తి, తుర్యావస్థల…
Author: ఉహలు- ఊసులు - సంధ్య
చెక్క ఇల్లు – నిప్పురవ్వ
అక్కడ- ఇక్కడ చెక్క ఇల్లు – నిప్పురవ్వ ఒక పాత జంధ్యాల చిత్రంలో ఒక సన్నివేశము “ఇండియా నుంచి అమెరికా వచ్చి, కుటుంబ పెద్ద ఇంటి గృహప్రవేశం అప్పుడు దూపం వేస్తుంటే పొగకు స్మోక్ అలారం మ్రోగి ఫైర్ ఇంజిన్ వస్తుంది”. హాస్యం పుట్టించినా ఆ సంఘటన ఇక్కడ, అంటే అమెరికాలో, నిప్పు అంటే వున్న జాగ్రత్తను, భయాన్నీ చూపుతుంది. మన దేశంలో మనం మంటల గురించి గాని, నిప్పురవ్వ పుట్టించే దారుణం గురించి గాని, ఇంత…
నాయనమ్మ మడి – తిప్పలు
మా పుట్టింట్లో చాలా మడి.. దడినూ … అందుకే మేము అసలు వంటింటి ఛాయలకు కూడా వెళ్ళేవాళ్ళము కాము మా చిన్నప్పుడు. ఏమి ముట్టుకుంటే ఎమి అక్షింతలేస్తారోనని భయం… అందునా మా నాయనమ్మ వున్నప్పుడు మరీనూ ఈ గొడవ ఇంకా కొంచం ఎక్కువయ్యేది. ఆవిడ మా ఇంట్లోనే ఉండేది,చాలా మటుకు, బాబాయిలు దగ్గర అప్పుడప్పుడు ఉండి వచ్చేది. ఆవిడ వూరు వెళ్లిందంటే మాకు అందునా నాకు చాలా హ్యాపీగా ఉండేది. నాయనమ్మ వంట గది ఎప్పుడూ తుడుచుకోవటం,…
శివారాజ్ఞీ-నీశ్వరీ
1. భక్తులను రక్షింప భవాని కదిలె కదలీ వనమునుంచి, దానవులను దుంచె దుర్గమ్మ చింతలుబాయగ చింతామణి గృహమునుంచి- 2. వెడలె వారాహి తోడుగ సుధలు పంచి సాదకుల జీవన సాపల్య మందించ వెడలి వచ్చె నంబ సుధాసాగర మధ్య నుంచి, నట్టి శ్రీచక్ర రధ వాసిని శరణనెదను!! 3. తల్లి పాదములాశ్రయించుటనొకటే మొక్షమార్గము! అంబ కరుణార్ధ దృష్టి చేత కరుగు జన్మ జన్మల కర్మలు! అమ్మ కొనగోటి కాంతి చాలు కోటి సూర్యులనెలిగించునట్టి …
ఇక్కడ-అక్కడ
ఇక్కడ- అక్కడ భూదేవికి -వందనాలు: పర్యావరణముపై అవగాహన కలిగిన తరువాత, మన ముందు తరాల వారికి స్వచ్ఛమైన వాతావరణము అందించాలనే సత్సంకల్పముతో ఈ Earth-Day ను మొదలెట్టారు . ఇప్పుడు ప్రపంచమంతా ఎదో సందడి జరిపే ఈ ఏప్రెల్ మూడవ ఆదివారము నాటికి మేము వాలంటీరు చేసే వీటీ సేవ తరుపున మేము Earth-Day లో పాల్గోన్నాము. ఆ సందర్భముగా నేను వెళ్ళిన పార్కు నిజానికి పార్కు కాదు. అది ఓక జాతీయ రిక్రియేషను కేంద్రము. టూకీగా…
ఆది శంకరులు – అపర శంకరులు
ఆది శంకరులు – అపర శంకరులు అధ్వైతం ప్రతిపాదించి నలుమూలలా, అణువణువుగా భారతావని యంతటా వ్యాప్తి చేసిన ఉద్ధారకులు! వింత వింత పోకడలతో సనాతన ధర్మమునకు ముప్పు వాట్టిల్లు సమయాన సత్యదండం చేతబూని జాతికి ధర్మభిక్ష చేసిన సత్యవాది! వేద, వేదాంగములకు, ఉపనిషత్తులకు బ్రహ్మసూత్రాలకు సరళ వ్యాఖ్యలతో భాష్యములు రాసి జాతికి జ్ఞాన భిక్ష చేసిన జ్ఞానవాది! హిందూ దేశానికి నలుదిక్కూలా నాలుగు మఠాలను దీపస్తంభములా నిలిపి,ధర్మ రక్షణకు దిక్చూచి గా నిలచిన ధర్మవాది! సర్వ దేవతా,…
దిబ్బరొట్ట దోశగా మారిన వైనం- కృషితో నాస్తి దుర్భిక్షం:
దిబ్బరొట్ట దోశగా మారిన వైనం- కృషితో నాస్తి దుర్భిక్షం: మా ఇంట్లో దోశ పల్చగానూ, చక్కటి రుచితో రావటానికి ఒక దశాబ్ద కాలమే పట్టింది. ఆ కాలంలో నేను పడిన తిప్పలు, అగచాట్లు అంత ఇంతా కావు. రాస్తే ఒక నవలైపోవునేమో. సినిమా తీస్తే జంధ్యాల వారి చిత్రంలా నవ్వుల హిట్ అయిఉండేది. ఓంప్రథమములో అంటే పెళ్ళికి ముందు ఇంట్లో దోశలు అమ్మ వాళ్ళు వేస్తె తినటమే అలవాటు. పెళ్లి తర్వాత మొదటి నెలలో అత్తగారు వాళ్ళు…
శంకర జయంతి
“ధర్మ సంస్థాపనార్థాయా సంభవామి యుగే యుగే ” అని గీతాచార్యులు చెప్పారు. సనాతన ధర్మం గతి తప్పి, చెక్కా ముక్కలౌతుంటే, అరాచకం ప్రబలి హైందవం 72 ముక్కలుగా అతలాకుతలమౌతుంటే, ధర్మం పునరుద్ధరించటము కొరకు పరమాత్మ స్వయంగా మానవునిగా వచ్చిన అవతారమే జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యులు. మనందరం నేడు ఇలా మనగలుగుతున్నామంటే, అనాది అయిన సనాతన ధర్మము ప్రపంచంలో తలెత్తుకు జయకేతం ఎగురవేస్తోంది అంటే- అది జగద్గురువుల భిక్ష. అయన జన్మించినది క్రీస్తు పూర్వం 507 అయినా, జన్మ…
Home improvement projects-
మేము వచ్చిన కొత్తలో ఇంటిని ఫర్నిష్ చేసుకోవటము మొదలు పెట్టాక మొట్టమొదటి సారి ఒక వింతయిన అనుభవం కలిగింది. నన్ను శ్రీవారు షాప్ దగ్గరకు వచ్చేయమని చెప్పి ఆఫీస్ కు వెళ్ళిపోయారు. షాప్ కు నేను డైరెక్ట్ గా వెళ్ళాను. షాప్ కి వెళ్ళాక నచ్చిన ఫర్నిచర్ చూసి ఇంటికి కావలసిన అలమారా, బీరువాలు, బల్లలు బుక్ చేశాము. డెలివరీ కి కూడా పే చేసాము. ఇంటికి వచ్చేస్తాయి ఇంక సర్దుకోవటానికి ఎక్కడ ఏమి పెట్టుకోవాలి అని…
గరిటెలు – తెల్లజెండా
ఈ రోజు మా శ్రీవారి జన్మదినం. అందుకే నాల్గింటికివచ్చారు భోజనానికి. వచ్చారుగా అని సంతోషంతో వడ్డించాను చేసిన అన్ని ఫలహారాలు. ఈయన పుట్టినరోజంటే మా పెళ్ళైన కొత్తలో విషయాలు గుర్తుకువస్తాయి నాకు. మా పెళ్ళైన రెండు నెలలకే తన జన్మదినం వచ్చింది. అప్పుడు మేము హైదరాబాద్ లోనే ఉండేవాళ్ళం. అత్తగారు వాళ్ళు మాతోనే ఉండేవారు. ఆ ఉదయం, “నూనె అంటమ్మా అబ్బాయి తలకు” అని మావగారు ఆజ్ఞ. నాకు ఇంకా ఇంత ట్రెడిషల్ వేషాలు లేవు. అంతా…