విశ్వనాథ సత్యనారాయణ మన తెలుగు వారవటము మనము చేసుకున్న ఒక అదృష్టం. వారి శైలి నారికేళ పాకం. అర్థమై కానట్లుగా వుంటుంది. లోతుగా శ్రద్ధగా చదివితే మాధుర్యం తెలుస్తుంది. తెలుగులో ఆయన రచించని ప్రక్రియ లేదు. మనము కొంత శ్రమతో వారి రచనలు చదవటం అలవాటు చేసుకుంటే కనుక, వారి రచనలు పండుగ భోజనంలా ఉండి చదువరులకు విందు చేస్తాయి. వారు గొప్ప మానవతావాది. ఆయన రచనలలో ఆనాటి సమాజం ఉంటుంది. వారి రచనలు చదివిన వారికి…
Category: మనసులో మాటలు
Hand-bag story
“హ్యాండు బ్యాగు” అంటే క్లుప్తంగా చేతి సంచి. నేటి ఆధునిక స్త్రీ చేతి లో అత్యవసరమైన ఆభరణాలలో లేదా వస్తువులలో ఒకటి. ఇది చేతిలో లేకండా మనము గడపదాటము. మనకు తోచదు కూడా. మన సర్వ సందలు ఒక ఎత్తు మన హ్యండు బ్యాగు ఒక ఎత్తు. దీని పుట్టు పూర్వోత్తరాలు పరిశీలిస్తే చాలా వింతైన విషయాలు కనిపిస్తాయి. పూర్వం పశ్చిమ దేశాలలో, యూరోప్ లో ముఖ్యంగా 17 వ శతాబ్దంలో పురుషులు డబ్బును, నాణ్యాలను ఉంచుకోవటానికి…
రంగుల ప్రపంచము
రంగుల ప్రపంచం మాల్‌లో షాపింగ్‌లో మళ్ళీ బ్లూ షర్టు తీసుకున్న మా శ్రీవారిని చూసి “అబ్బా మళ్ళీ బ్లూనేనా? అన్నాను…. బ్లూ ఉంటే ఇంకా మరో రంగు కనపడదు కదా ఆయనకి. మధ్యాహ్నం హాని ఫోన్, “అమ్మా! నా వైటు చుడిదారు పంపు, నా ఫ్రెండు పెళ్ళికి అది వేసుకుంటా!” వైటు బాగుంటుంది, సరేలే అనుకున్నా! అక్కయ్య వాళ్ల పాప కి కొన్న కొత్త చీర ఎరుపు కంచి పట్టు. బాగుంది అని చెప్పాను. ‘పెళ్ళికి నీకే…
కథ – నవల
ఈమధ్య వస్తున్న కొన్ని రచనలు చూసాక కొన్ని మౌలిక ప్రశ్నలు మనకు తప్పక ఉదయిస్తాయి. అసలు కథకు, నవలకు తేడా ఏంటి?అని. ఎందుకు అసలు నవల కానీ, కథ కానీ రాస్తారు ఈ రచయితలు? ఏదైనా ఎలాగైనా రాయవచ్చా? అన్న ప్రశ్న మనలను తికమక పెడుతుంది ఈ రచనలు చదివితే. దానికి కారణం చాలా మటుకు తలా తోక లేకుండా ఉండే కథనంతో, నవల అనే పేరు పెట్టి ఈ సాంఘిక మాధ్యమాలలో వస్తున్న రచనలు. …
హిందోళ రాగము
“శిశుర్వేత్తి పశుర్వేత్తి వేతి గానరసం ఫణి కోవేత్తి కవితా తత్త్వం శివో జానాతి వా నవా ” అన్ని పెద్దలు చెప్పారు. చిన్నలను పెద్దలను, పశు పక్షాదులను సమానముగా అలరించి మైమరపించే శక్తి సంగీతానికి ఉంది. అలాంటి సంగీతంలో కొన్ని రాగాలు మరీ అవలీలగా ఆకట్టుకొని, హృదయాన్ని ఉరూతలూగిస్తాయి. అలా అలవోకగా మనసును రంజించే రాగాలలో “హిందోళ” రాగ మొకటి. హిందుస్తానీ వారు ‘మాల్కోస్’ అంటారు దీనినే. దీనికి 20వ మేళకర్త అయిన ‘నటభైరవి’ జన్యం. ఈ…
పంచభూతాత్మకం
అమ్మకు పిల్లలము మనము తప్పులు కాచి దారి చూపే దిక్ఛూసి మనకు ఆమె నడక నేర్చు బాలలము మనము, పడుతూనే వుంటామది మన నైజము.. లేవదీసి, చేరదీసి ఊరడించి,ఓషదమిచ్చు వైద్యరాలామె. అజ్ఞానులము మనము తల్లిని తలచిన తడవనే జ్ఞాన దీపమెలిగించు దక్షిణామూర్తియే ఆమె భవసాగరమనంతము… కడు భయానకము.. భవము కౄర అరణ్యము, భయమేల మాకు ఈ సంసారమన్న అరణ్యమునకు అమ్మ అమృత వర్షమై కురియచుండగా- పాపమన్నది కడు దుర్భలమైన కాననము. అమ్మ భక్తి కార్చిచ్చులా కాల్చునా పాపమును….
నిర్జన వారధి – సమీక్ష
మనం మన తప్పుల నుంచి నేర్చుకోవాలంటే మన జీవితకాలం సరిపోతుందా? చాలదు కదా! అందుకే మనం ప్రక్కవాళ్ళ జీవితం చూసి కొన్ని నేర్చుకోవాలి. అది ఎలా అని ప్రశ్న వచ్చినప్పుడు, జీవిత చరిత్రలు చదివి అని చెప్పవచ్చు. మంచి జీవిత చరిత్రలు, మనలను ఉత్తేజపరిచే జీవిత చరిత్రలను ఒక లిస్టు రాసుకుంటే దానిలో తప్పక జత పరచవలసిన పుస్తకాలలో “నిర్జన వారధి” తప్పక ఉంటుంది. కొండపల్లి కోటేశ్వరమ్మగారి సమగ్ర చరిత్ర ఇది. కోటేశ్వరమ్మ గారు కమ్యూనిష్టు పార్టి…
Internation Women’s Day
“యత్ర నార్యస్య పూజ్యంతే రమంతే తత్ర దేవతా” ఇది శృతి వాక్యం! ఎంతమంది ఆధునిక పురుషులు దీనిని నమ్ముతారంటే అదో పెద్ద ప్రశ్న. గుడిలో దేవతగా స్త్రీ బొమ్మను మొక్కుతారు, కానీ ఇంట్లో భార్యను కష్ట పెడతారు. (అంతా కాదు, కానీ అధిక శాతం పురుషులు) స్త్రీ పురుషులు ఇద్దరూ ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు అయినా, ప్రతి మతం, కులం అనాదిగా స్త్రీలను ద్వితీయ పౌరుల తరహాలోనే చూసింది, చూస్తున్నది,చూపించింది అన్నది నిర్వివాదం. హిందూ లైన…
మాతృభాషాదినోత్సవము
1.అమ్మ చిరునవ్వు భాష తెలుగు। అమ్మ మమ్ముల దగ్గరకు తీసుకొని పెట్టిన గోరు ముద్దలు భాష తెలుగు। మా చిన్నతన్నాన ఆడిన గుజ్జనగూళ్ళ భాష తెలుగు। నాన్న చెయ్యి పట్టుకు నడిచిన నడత తెలుగు।। 2.నన్నయ్య అక్షర రమ్యత తెలుగు। తిక్కన నాటకీయత తెలుగు। కృష్ణరాయలు పద్యసొగసు తెలుగు। రామకృష్ణుని చతురత తెలుగు। పెద్దన ప్రవరుని పవిత్రత తెలుగు। నంది తిమ్మన నుడికారము తెలుగు।। 3.పోతన భాగవతపు వెలుగు తెలుగు। శ్రీనాధుని వీర శృంగారము తెలుగు। గురజాడ…
కుదిపేసిన గొల్లపూడివారి సాయంకాలము
మంచి పుస్తకానికి ఉన్న లక్షణం పాఠకులను ఏకధాటిగా చదివించటంలోనే కాదు, చదివాక దాని ప్రభావంలో ఆ చదివిన వారు కొట్టుకుపోవడం. అదీ అట్లా ఇట్లా కాదు, పూర్తిగా మునిగి పోవటం. వారిలో కొంత మార్పు తేవటము. పాఠకులు తమ కథను ఆ చదివిన కథతో అనుసంధానించుకోవటం. పాత్రలలో మమైక్యమైపోవటం. తమ కోణంలో ఆ కథను చూడటం. కొన్నిచోట్ల కథతో తాదాత్మ్యం చెందటం. కథను కొంత సమర్ధించుకోవటం. వెరసి పూర్తిగా అందులో మునిగి తమను తాము కోల్పోయేలా చేసేది…