హిమాలయములు అద్భుత సౌందర్య సంపదల నిలయమా , అనిర్వచ ఆనందాలు పండించు శికర సమూహమై, రాశిభూతమైన సర్వ సంపదలభౌతిక రూపమై, మురిసితివి నీవు హరునకు ప్రియమైన ఆవాసమై, జగములనేలు జగదంబ పుట్టినిలై, హరికి మిగుల ప్రాణమై, బదిరికా వనమై, మహోన్నత ఉత్తుంగ తురంగ తరంగమై సురగంగ నృత్యాల వేదికై, యక్ష గంధర్వ కిన్నెర కింపురుషులకు ఆలవాలమై, పవిత్ర జలముల మేటి సెలయేటిల కంజారమై, హొయలు మీర సొగసు చూపు జలపాతముల సంవాసమై, ఆధ్యాత్మికతను పండించిన భూమికై మహా…
Category: మనసులో మాటలు
బ్రహ్మకపాలము
బ్రహ్మకపాలము :: బ్రహ్మకపాలం గురించి అంతా వినే వుంటారు. నాకు తెలిసినంత వరకూ దాని గురించిన కథ ఈ విధంగా సాగుతుంది. పూర్వం బ్రహ్మ గారికి ఐదు తలలుండేవిట. ఏదో విషయములో ఆయన రుద్రునితో విభేదించటం, మహాదేవుడు తన చిటికనవేలుతో తల కొట్టేయ్యటం జరిగాయి. తెగిన తల రుద్రునికి గోరుకు అంటుకుపోయ్యింది. బ్రహ్మ హత్యా దోషము కూడా తోడైయ్యింది. బ్రహ్మగారి తల కపాలంలా కూడా మారింది. రుద్రుడు ఆ కపాలంతో బిక్ష చెయ్యటం కూడా చేసాడుట. ఆయనకు…
‘మనా’ భారత చిట్టచివరి గ్రామము!!
‘మనా’ లో ఒక రోజు. భారత దేశపు చిట్టచివరి గ్రామము “మనా” ను సందర్శించే అవకాశము నేను బదిరికి వెళ్ళిన రెండో రోజు కలిగింది. బదిరిలో నేను వున్న ఆశ్రమ సిబ్బంది నాతో ఎంతో ప్రేమగా వారి సొంత కుటుంబ సభ్యులలా ఆదరించారు. నే వెళ్ళిన తరువాత రెండోనాడు దేవాలయం నుంచి మధ్యహానము వేళకు నేను ఆశ్రమము చేరగానే శ్రీదరు (అక్కడి కేర్టేకరు) మనము ఈ రోజు మనా వెడుతున్నాము అన్నాడు. నే సరే యని భోం…
Nealkant
హిమ పర్వత శిఖరాల అందం! వర్ణించటం ఎవరికైనా అసాధ్యం !! కొంత సోయగాలు కొంత ముదిత తనాల… నీలకమల మందు ప్రత్యేకం (NelKant name of the mountain at Badrinath) సదా నాతో దోబూచులాడుతునే వుంది ముబ్రుల తెరలు వీడక ముసుగేసుకుంటుంది చాలా కాలము. పెద్దచేప వెంటుండే చిన్న చేపలలా మబ్బులు సదా ఆ పర్వతాని తాకి వేలాడుతునే వుంటాయి. కొత్తగా పెళ్ళయిన భర్త భార్య ను పట్టుకు వదలనట్టు వెళ్ళాడుతునే వుంటాయి. ఎదో ఒక…
నమో గంగా నమో నమః
గంగా నమో నమః!! ఆకాశమునుంచి పరమ శివుని శిరసు మీదకురకంగా గలగలా పరవశముగ మని పారంగా శిఖిఫించుని పాదములను బదిరిలో కడగంగా పంచ ప్రయాగలను పవిత్రంగా కలపంగా హరి హరియని తలవంగా హరిద్వారమున హారతులను అతిశయముగ అందుకొని మురవంగా ఆదరంగా ఆ గంగా మనమున నమ్మి మునగంగా పాపము బాయును ఆదరంగా వాగులు వంకలు వచ్చి కలవంగా హెచ్చుగ నాగరికత విరవంగా చరిత్రను దర్పణంగా చూపంగా జీవాధారమై నడవంగా ఆనందాలుగ మానవాళి మురియంగా.. మన గంగా!! కాశీ…
వరుసలే ముద్దు – తోపుడు వద్దు!!
మా చిన్నప్పుడు తెలంగాణాలో వున్న మా వూరి నుంచి కేవలం బస్సులు మాత్రమే లభ్యం. అందుకే బస్సులలో ఎక్కువగా ప్రయాణం చెసేవాళ్ళం. అప్పుడు అదొక ప్రహసనంలా సాగేది. దిగేవారిని దిగనీయ్యకపోవటం, ఎక్కేవారిని అడ్డుకొనటం. ఒకళ్ళను ఒకరు తోసెయ్యటం. కిటికీలు పట్టుకు వేలాడటం. దస్తీ వేసో, టవలు పర్చో… సీటు రిజర్వు చెయ్యటం, ఒకటేమిటి….తోసుకు వెళ్ళేవాడు తోపు…… లైను కట్టక కట్ చెయ్యువాడు వీరుడు…ఇలా ….ఒక రేంజు… వుండేవి బల పదర్శనలు. ఈ తోసుడు వుంది చూడండి బుద్ది…
దేవీం శరణమహం ప్రపద్యే
మన రుషులు దర్శనంతో గ్రహించి అందించిన జ్ఞాన సంపద అనంతము,అపారం. అందులో మన కర్మను బట్టి మనకు కొంత ఆ జ్ఞానము లభిస్తుంది. సృష్టికి పూర్వం సత్‌చిత్ స్వరూపము ఒకటున్నది. ఆ సత్‌చిత్….అంటే ఎలాంటి చలనము లేక, నిశ్చలంగా, సదా ఆనందంతో, తనలో తాను రమిస్తూ వున్న ఆ స్వరూపమునకు పేరు లేదు. ఆ పదార్థంని “పరా” అన్నారు. అది పూర్తి సచ్చితానంద స్వరూపము. ఆ పరా లో చాలా కొద్ది భాగము (కేవలం 1% అనుకోవచ్చు)…
బరువు
బరువు ప్రపంచాన్ని ఊపేస్తున్న ఒకానొక సమస్య… అది ఫలానా బరువు అని చెప్పలేము … అంటే, శరీర బరువు ఒబేసిటీ, మనసులో బరువు స్ట్రెస్, దేశాల మధ్య బరువు యుద్ధాలు, రాజకీయనాయకులకు బరువు వారి సుపుత్రులు, లేదా బంధువులు… ఇలా ఇలా… అసలు బరువు … అంటే ఏంటి? అనవసరమైన లేదా ఎక్స్ ట్రా …లేదా ఉండవలసిన దానికన్నా ఎక్కువ ఉండటము కదా, అందునా అది మనకు పనికి రానిదై ఉంటుంది. మరి పనికి రానిదాన్ని మొయ్యటమెందుకు?…
మిత్రులతో సరదాగా కాసేపు
“మీతో స్నేహం స్వల్పం మైత్రికి హృదయం ముఖ్యం అందుకే మిమ్ముల బాగా ఎరుగుదన్నది సత్యం” అన్న భుజంగరాయ శర్మ గారి మాటలు ఎంత నిజాలో నేడు నాకర్థమైయ్యింది. నిన్న మా చిన్ని కుటీరము వేదికైయ్యింది ఆ మాటలలోని నిజాలు అక్షర సత్యమని తెలుయటానికి. నిన్నటి రోజు తార్నాకా పర్ణశాలలో నవ్వుల పువ్వులు పూచాయి. మిత్రుల కబుర్లు, కౌగిలింతలు, అల్లర్లు,పాటలు, నృత్యాలు ఒకటేమిటి అన్నీనూ…సంతోషపు స్నేహ సౌగంధాలలో మా మనసులు తడిసాయి. అమృతంతో పాటు నవ్వులు పంచే మా…
కూచి గారితో కాసేపు
కూచి గారితో కలయిక- నిన్న ఒక అద్భుతమైన విచిత్రం జరిగింది. అదేమంటే…. కళ్యాణి కాశీభట్ల ఒక కవిత రాశారు, అది విచిత్రం కాదు…. దానికి ఒక అందమైన బొమ్మను కూడా కలిపి భావుకలో పోస్ట్ చేశారు…. అదీ విచిత్రం కాదు…. నాకు నచ్చి ఆ బొమ్మ గురించి వివరాలు అడగాలని ఆ ‘పిక్’ ని దాచాను… అది విచిత్రం కాదు… మీరు విసుగు పడకండి మరి …. అసలు విచిత్రమేమంటే …… ఆ చిత్రం గీచిన అద్భుతమైన…