హిమ పర్వత శిఖరాల అందం!
వర్ణించటం ఎవరికైనా అసాధ్యం !!
కొంత సోయగాలు
కొంత ముదిత తనాల…
నీలకమల మందు ప్రత్యేకం
(NelKant name of the mountain at Badrinath)
సదా నాతో దోబూచులాడుతునే వుంది
ముబ్రుల తెరలు వీడక
ముసుగేసుకుంటుంది చాలా కాలము.
పెద్దచేప వెంటుండే చిన్న చేపలలా
మబ్బులు సదా ఆ పర్వతాని
తాకి వేలాడుతునే వుంటాయి.
కొత్తగా పెళ్ళయిన భర్త భార్య ను పట్టుకు వదలనట్టు వెళ్ళాడుతునే వుంటాయి.
ఎదో ఒక గంట తెరిపిలో
అందాలన్నీ యాత్రికులకు పంచింది నీల కమలము
ఇక్కడే భీముడు “హిమగిరి సోగసులు … మురిపించును మనసును..” అని పాడి వుంటాడు.
ఈ పర్వత సౌందర్యం చూసి కాళిదాసు మేఘసందేశము రాసుంటారు.
ఈ సౌందర్యం చూచే పెద్దనామాత్యులు ‘మన చరిత్ర ‘ లిఖించి వుంటాడు.
ఆ మహాదేవుని రాజ్యము మిది సౌందర్యం కురిపింక ఇంకెట్లుండు.
నాతల్లి జగదంబ పుట్టిలు… ఇంత సౌందర్యమొప్పారక మరి ఇంకెట్లుండును కదా!!
హిమవంతుని సౌందర్యం పార్వతి కుమార్తెగా రావటము వలన మరింత మెరుగైనదిగా!!
ఇది సౌందర్యం వోప్పాడు ప్రశాంతమైన ప్రదేశం కాబట్టి మునులు స్థిరనివాసమేర్పచుకున్నారు.
వెదవ్యాసుడు మహాభారతము రాశాడిచ్చటే!
శంకరభగవత్పాదులవారు తపమొనర్చారిచ్చట!!
ఇంద అందమైన హిమాలయాలు
సదా ఆదరముగా ఆహ్వానించి అక్కున గట్టుకున్నాయిగా!!
నా గురుకృప వలన, నాకు లభించిన భాగ్యం ఈ హిమాలయ సందర్శన భాగ్యం.
సంధ్యా యల్లాప్రగడ