సత్సాంగత్యము – ‘క్రియా’ అంటే పని అని కదా అర్థం. నిఘంటువు అర్థం కూడా అదే. యోగా అంటే ధ్యానము, ఔషధము; అపూర్వవస్తుప్రాప్తి అని అర్థం చెబుతారు. ఈ రెండు కలిపి “క్రియా యోగ” అన్న మాటకు అర్థం ధ్యాన మన్న పని అనుకున్నా దానికి పరమార్థం మాత్రం సమస్తం, ఫలితము అనంతం. అసలు ‘క్రియాయోగా’ అన్న మాట మనకు “ఒక యోగి ఆత్మకథ” లో పరిచయం చేయబడుతుంది. ఆ పుస్తకం ప్రపంచానికి చేసిన మహోన్నతమైన మేలు…
Category: మనసులో మాటలు
తపమేమి చేసితినో….
నేను భారతావనికి వచ్చిన వెంటనే ‘వీ.టీ సేవ’ వేసవి internsకు పర్యవేక్షకురాలిలా వెళ్ళిపోవటం జరిగింది. ఆ మధ్యలో నేనో పని చేశా. అది… ఎన్నో వేల మందిని తన రచనలతో ప్రభావితం చేస్తూ, వివిధ భాషలలో వున్న అద్భుత కవిత్వాన్ని తెలుగు భాషాభిమానులకు పరిచయం చేస్తున్న తాత్విక, సాహిత్యవేత్త, ప్రతిరోజూ ఫేసుబుక్ ద్వారా వివిధ విషయాలను అలవోకగా అందిస్తున్న, పరిచయం అవసరం లేని చినవీరభద్రుడు గారితో మాట్లాడటం. ఆయనకు నేను వెళ్ళే అల్లంపల్లి గురుకులం గురించి తెలుసు….
విశాఖ
అందమైన సముద్రతీరం అంతకన్నా అందమైన బీచ్ వెంబడి మార్గం, ఆ సముద్రపు వడ్డున ఒక ప్రక్కన ‘వారిజ’ ఆశ్రమము ఎక్కడ్నుంచి చూసినా కొబ్బరి చెట్ల దర్శనం కన్నులకు పండుగగా ఆకాశము ఏకమగునట్లు దివ్యదర్శనపు సాగరం ఆశ్రమంలో అందమైన కుటీరం పర్ణశాలల సోయగం వేద పాఠశాల, అంధబాలల విద్యాలయం దినమంతా భగవంతుడు శ్రుతి చేసిన హోరున సంద్రం దీటుగా హయగ్రీవాలయన వేద గానం నిండుగ కాపున పండ్ల చెట్లు ప్రాంగణం కడుపు నింపు కమ్మని బోజనపు ఇందు హరితము…
VT Seva in June – July
ఈ మధ్యన అంటే ఈ వేసవిలో అట్లాంటా వీటి సేవలో మేము చేసిన వివిధ కార్యక్రమాలలో ‘హెబిటాట్ ఫర్ హ్యుమానిటి’(Habitat for Humanity)ఒకటి. ఇది ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. ఇందులో భాగంగా ఈ H for H వారు గుర్తించిన దిగువ తరుగతిలో (దాదాపుగా పేదరికపు అంచున) వుండి,కుటుంబ భాద్యతలు వుండి, వారికి వచ్చే సంపాదన వారికి సరిపోక, నిలువనీడ లేని వారి కోసం ఒక ఇల్లు నిర్మించి ఇవ్వటం. ఆ ఇంటికి కావలసిన స్ధలం వీరిదే…
పదిరోజుల సంగీత మధురాలయం మా గృహం
“కొన్ని సినిమాలు చూసినప్పుడు అలా వుంటుందా? అన్న అనుమానము కలుగుతుంది”. నేటి హడవిడి చిత్రాల గురించి కాదు, మన కాశీ విశ్వనాథ గారి చిత్రాల లాంటివి. “ఒక సంగీత విద్వాంసులు…. కొబ్బరాకుల నుంచి జాలుగా జారిన నీరెండ నీడలు… మంద్రంగా శ్రుతితో తంబూర….. రాగం… వంట ఇంట్లో ఆ ఇంటి ఇల్లాలు వండుకుంటూ ఆ మంద్ర సంగీతాన్ని ఆస్వాదించటము…” ఇలాంటివి వుత్త కథలలో, విశ్వనాథ సినిమాలలోనే అని నాకో అనుమానముండేది. ఫణి గారు మా ఇంటికి రాక…
ఇది శారద దేవి మందిరమే
ఇది శారద దేవి మందిరమే …. అమ్మవారు శారదా దేవిగా, వాగ్దేవిగా, సంగీత లీలా ప్రియగా, గాత్రములో, వివిధ సంగీత వాయిద్యములలో నివసించి మానవులకు రసానందం కలిగించి జీవితం ధన్యత చేకూరుస్తోంది. రాగం పల్లవించినవేళ …. తాళం తాండవించినవేళ .. మహతి సొగసులిడినవేళ ఒక చక్కటి సాయంత్రపు శుభముహూర్తాన మానసమున బ్రహ్మానందము నృత్యం చేసిన మధుర కచ్ఛపి ని మీటిన వైణికులు శ్రీ పణినారాయణ గారి రూపములో నాదము అట్లాంటా నేలను తడిపి ప్రమోదాహ్లాదానందాలు ముంచిన సమయమది….
గురువుల సేవలో
అట్లాంటా అంటే మేముండే ఊరనే కాదు, ఈ మధ్యకాలంలో ఆధ్యాత్మికత లో ఎంతో మునుముందుకు సాగుతున్న నగరం . ఎలాగంటారా? బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి చే “ప్రబోధ సుధాకరం – కృష్ణ భక్తి” తో ఈ వారమంతా, మేము మునిగి తేలితిమిగా.. జూన్ 25 న గురువుగారు అట్లాంటా కు విచ్చేసారు. అంత ప్రయాణ బడలికలోనూ వారు నన్ను గుర్తుపెట్టుకొని వెంటనే మా ఇంటికి వచ్చి మా ఆతిధ్యం స్వీకరించారు. వారి రాకతో మా గృహము,…
Feel Positive
జీవితం మీద చిరు ఆశ, మమకారము వదలకూడదు. ఎంత ప్రతికూల పరిస్థితులొచ్చినా ఎదురీది నిలబడాలన్నది సూక్తి. ఈ చిరు మొక్క దానికి వుదాహరణ. శీతాకాలపు చలికి కనుమరుగైనవి వసంతంలో చిగురించి ఆనందాన్ని, ఆహ్లదాన్ని పంచంటము సహజము. కాని ఇది ఇంట్లో నే పెంచవలసిన ఐదు ఆకుల అదృష్ట మొక్క. చైనీయులు చాలా నమ్ముతారట. ఈ మొక్క చాలా పెద్దగా పచ్చగ కళకళలాడుతూ వుండేది. శీతాకాలము బంధువులొచ్చినప్పుడు పిల్లలు తోసేస్తున్నారని శ్రీవారు గరాజ్ లోకి వీటిని బడిలీ చేశారు….
ఆహా ఏమి రుచి అనరా మనసారా
నేను ఒక మిత్రుల ఇంటికి వెళ్ళాను. రమ్మని, కూర్చోబెట్టి వద్దన్నా స్నాక్స్ ఇచ్చారు. స్నాక్స్ తినకూడదు. తింటే ఒక ప్రమాదము వుంది. అదేమంటే తినటం మొదలెడితే అవి కంప్లీట్ చేసేవరకు ఆగలేము. వాటికి తోడు ఆ చెక్కలు అవీ నోట్లో పెట్టుకుంటే కరిగిపోతున్నాయి. చిన్నప్పుడు మధ్యాహనాలు అమ్మ చేసిన కారపూస సాయంత్రం బడి నుంచి వచ్చినప్పుడు తింటుంటే ఎలా ఉంటాయి…. అలా చాలా ఫ్రెష్ గా రుచిగా కమ్మగా వర్ణించటానికి నా దగ్గర మాటలు లేవు…. అలా…
ఏం జరిగుతోంది మన (అమెరికా)సరిహద్దులలో
అమెరికా అంటే మెల్టింగ్ పాట్. ఇక్కడ అంతా కలిసిపోతారని కదా ఆ పేరు. తమ ప్రతిభకు గుర్తింపు ఇచ్చే దేశంగా ప్రపంచంలో ప్రసిది కెక్కింది. నాలుగు వందల సంవత్సరాల క్రితం ఎవరికీ తెలియని దేశం. కొలంబస్ భారతావనికి సముద్ర మార్గంకై వెతుకుతూ దారి తప్పి ఈ నేల మీద కాలు మోపాడు. ఆయన వచ్చినప్పుడు, ఈ పచ్చని మైదానాలని, నదీజలాలను చూసి, భారతావని కి వచ్చానని తలచి, కనపడిన ఇచటి ప్రజలను భారతీయులనుకొని, ఇండియన్స్ అని నామకరణ…