జీవితం మీద చిరు ఆశ, మమకారము వదలకూడదు. ఎంత ప్రతికూల పరిస్థితులొచ్చినా ఎదురీది నిలబడాలన్నది సూక్తి.
ఈ చిరు మొక్క దానికి వుదాహరణ.
శీతాకాలపు చలికి కనుమరుగైనవి వసంతంలో చిగురించి ఆనందాన్ని, ఆహ్లదాన్ని పంచంటము సహజము.
కాని ఇది ఇంట్లో నే పెంచవలసిన ఐదు ఆకుల అదృష్ట మొక్క. చైనీయులు చాలా నమ్ముతారట. ఈ మొక్క చాలా పెద్దగా పచ్చగ కళకళలాడుతూ వుండేది. శీతాకాలము బంధువులొచ్చినప్పుడు పిల్లలు తోసేస్తున్నారని శ్రీవారు గరాజ్ లోకి వీటిని బడిలీ చేశారు. ఆ రోజే చెప్పాను మైనస్ లో వుంది టెంపరేచరు ఇంట్లోనే వుంచుదాము అని. వినలేదు. తర్వాత ఇంట్లో పెట్టినా…. ఆ మొక్క మా మీద అలిగి ఒక్కో ఆకే వదలేసింది. చూస్తుందగానే పచ్చదనము పోయి మొడై నిలిచింది. దిగులేసింది.
‘అయ్యో! రక్షించుకోలేక పోయాను….క్షమించు తల్లి’ అని ఆ ఎండిన మొక్కను మ్రొకాను.
తరువాత దానిని కొమ్మలు తీసేసి బయట వదిలేశాను.జోరున వానలు పడుతున్నాయి. ఆ కుండిలో వేరె మొక్క పెట్టె టైమే కుదరటంలేదు. ఈ రోజు చూస్తే చూడండి చిన్న ఆకులతో ఎంత అందంగా వుందో. సంతోషముతో గెంతులెయ్యాలనిపించింది.
అవును మరి,ఏదీ ఆపకూడదు. మధ్యలో విడవకూడదు. అది పనైనా, జీవించమైనా…..ఎంతటి ప్రతికూల పరిస్థితైనా….మారుతుంది. వసంతం తప్పక వస్తుంది
జీవితంలో ఎప్పడు నిలబెట్టుకోవాలస్సింది “జీవితేచ్ఛ” నే అని ఈ చిట్టి మొక్క గుర్తుచేసింది ఈ ఉదయము.