కవిత్వము:
కావాలోయి కవిత్వము – అన్నింట్లో మానవత్వం!
ఆర్యులు అందించిన వేదఘోష కవిత్వము।
ఆదికవిత మొదలెట్టిన నన్నయ్యది కవిత్వము।
భక్తిని ఔస్సులకొద్ది త్రాగించిన పోతనదీ కవిత్వము।
కులమతాల కుళ్ళును కడిగిన వేమనదీ కవిత్వము।
విశ్వనాధ, కృష్ణశాస్త్రి, మెరుగులు దిద్దినది కవిత్వము!
అమృతాన్ని కురిపించిన తిలక్ దీ కవిత్వము!
పద కవితా పితామహుని పదాలన్నీ కవిత్వము।
ఆదిబట్ల ఆడించిన చిఱుతల చిరధ్వని కవిత్వము।
ప్రజల గుండె చప్పుడును ప్రతిధ్వనించిన శ్రీ శ్రీ దీ కవిత్వము।
అచ్ఛజానపదుల లల్లాయిలు కవిత్వము!
సాటిరాని మేటి సినరె సిరా రంగు కవిత్వము।
ధాశరథి, నారాయణాచార్యులు ఆలపించినది కవిత్వము।
విప్లవాల జ్వాలలో అగ్నిఖీల కవిత్వము।
నైజాముల నైజాని నిలదీసిన కాళోజీది కవిత్వమే।
గద్దరన్న గజ్జల చప్పుడు కవిత్వము
అవనీతి వికృతాల ఆరదీత కవిత్వము।
పడిపోతున్న మానవత్వపు విలువలను నిలబెట్టేది కవిత్వము.
నిశ్వాస, ఉఛ్వాస ల సోఽహం మే కవిత్వము!
ప్రాణవాయవైన కవిత్వానికి ప్రత్యేకంగా ఒకరోజా??
కవిత్వం శ్వాసించని మరుక్షణం
మరుగవును మానవత్వ మనుగడనే!!