నీ లోన వున్న నీవు
————————
తిరిగిని, భువి యంత ప్రదక్షిణ చేసినా,
దేశాలు ఎగిరినా,
ఖండాలు దుమికినా
పుణ్య క్షేత్రాలు తిరిగినా
అణువణువు వెతికినా
జల్లెడేసి గాలించినా
స్తంభించి శోదించినా
దొరకునా? అది నీకు దొరకునా?
వెతికి వెసారాక
కడకు మిగిలేది లేదుగా
వెతరవలసినది లోన
వెతికితే లోలోన,
వెతికితే నీలోన, లోలోన…..వున్నదది
అమ్మే ! అది నీవే….
నీ ఆత్మగా నుండి, నీ వెలగుగా వుండి
నీ జీవితము పండి… నిలిపేది అమ్మగా…
అంతర్ముఖ సమారాద్యా, బహిర్ముఖ సుదుర్లభా।।
మీ
సంధ్యా యల్లాప్రగడ