విలంబకి స్వాగతం
చలి ఇకనన్నా తగ్గమని ప్రకృతిని వేడుదాం
చైత్రానికి గుర్తుగా వికసించిన పుష్పాలు
నగరానికి అద్దాయి హరివిల్ల చందాలు
స్వరరాగ మదురిమల ఉద్యానవనాలకు
సన్నద్దమవుతున్న వీది వాకిలులు
ఎగిరాయి పక్షులు, మురిసాయి వృక్షాలు…
మనందరము మనుష్యులం
దేవుని సృష్టికి గుర్తులం
మన హృదయాలు పండాలని..
ప్రపంచము శాంతి దిశగా నడవాలని
రేపటి మీద ఆశతో ముందుకడుగేదాం
కలసి మెలసి నడుదాం
వెలుగు ప్రగతిబాటగా
మునుముందుకు నడుదాం
వివంబను స్వాగతిద్దాం
మీ
సంధ్యా యల్లాప్రగడ