నేను ఎదైనా ఒక విషయం నమ్మితే మరి వెనక్కు చూడను. అలాగే చాలా లయల్ కస్టుమరు నుకూడా. ( నమ్మకమైన వినియోగదారు).
ఎదైనా మొదలెడితే తుఫానులు వచ్చినా, భూగోళం బద్దలైనా వదలను. అలాగని అగౌరవాన్నీ తీసుకుంటామా? తీసుకోవాలా? భారతదేశంలో వినియోగదారులు ఇది చాలా ఆలోచించవలసిన విషయము.
నేను ఒక 20 సంవత్సరాల క్రితం “ఆంద్రాబ్యాంకు” లో నా ఖాతాను తెరిచాను. ఆ బ్రాంచు తార్నాకాలో ఇంటి ప్రక్కనే. అది తెరచినప్పుడు NRI ని కాదు. కానీ కొంత కాలానికే (6నెలలకే) నేను ఇటు వచ్చేయ్యటం జరిగింది. నాకు అక్కడకు వెడితే తప్ప ఇక ఆ బ్యాంకుతో పని వుండదు. వాళ్ళు కంప్యూటరు ఖాతాలు కానీ, వినియోగ దారులకు సేవలందించే విషయంలో చాలా వెనక పడి వున్నారు. నాలాంటి NRI లకు నిజానికది చాలా ఇబ్బంది. అయినా చాలా కాలంగా వున్న అకౌంటు అని, ఇంటి ప్రక్కనే అని అలా వుంచేశాను. ఎన్ని సంవత్సరాలు గడిచినా, అక్కడ భారతీయ ఫోను నెంబరు లేకపోతే మనము online account ను వాడుకోలేము. అదీ కాక user friendly గా వుండదా వెబ్ సైటు. ఇన్ని కష్టాలకోర్చి ఎదో వుందిలే అని లాగించాను ఇన్నేళ్ళు.
అంత లాయల్ గా వుండటం శుద్ద దండగని తెలిసింది.
– నాకు చెకు బుక్ లేదు. డబ్బు అవసరము. ఇండియా వెళ్ళిన వెంటనే నా కొత్త పోను నెంబరు ఇచ్చి చెకు బుక్క్ కోసం అప్లికేషను ఇచ్చాను. రాలేదు. తరువాత వెళ్ళినప్పుడు ఆ కర్కును బ్రతిమిలాడితే (?)అతను సబ్ మెనేజరును అడగమని సలహా ఇచ్చాడు.ఆవిడను రిక్వెష్టు చేస్తే ఆమె ఆధార్, ప్యాను జిరాక్స్ కాపీలతో అప్లికేషను తీసుకురమ్మనది. జిరాక్స్ కు బ్యాంకు బయటకు వెడితే అది మూసి వుంది. ఒక అర కిలోమీటరు దూరం లో వున్న మరో షాపుకు రోడ్డు క్రాసు చేసి వెళ్ళి ఆ రెండూ జిరాక్స్ తెచ్చి, జీవితములో మర్చిపోయిన లెటరు రిక్వెస్టు తో రాసి సబ్ కి ఇస్తే…. ఆమె అచ్చు ప్రభుత్వ కార్యాలయం లో వలె ఒక గీత గీసి దూరం గా వున్న మరో క్లర్కు దగ్గరకు తీసుకు వెళ్ళమంది.
సరే – వెళ్ళి అతనిని బ్రతిమాలితే, ఆయన దాని మీద మరో గీత గీసి మరొకరిని పిలిచాడు. అటెండరు అనుకుంటా వచ్చి వాటి మీద స్టాంపు కొట్టి అది మరో బల్లకు బట్వాడా చేసి వెళ్ళింది.
ఆ టేబులు తాలుకూ ఆ శాల్తీ ప్రక్క నున్న ఇంటర్కమ్ లో ఏ నంబరు ఎవరికి పోతుందో నొక్కుకుంటూ అసలు చూడనట్లు ప్రవర్తన. అప్పటికి ఈ మొత్తం ఆ ప్రక్రియ మొదలై 50 నిముషాలు. ఆ శాల్తీ తో “సారు చూడండి” అని బ్రతిమిలాడితే , అచ్చు ‘April1 విడుదల’లో దివాకరం లా “ ఆ వుండవమ్మా! ఇక్కడ మేము పనిలో వున్నాము ..” అంటూ టిక్కు టిక్కు నొక్కుకుంటూ …. ఆ .. ఆ నెంబరు వాడిది… ఇది మీది…. ఇలా కాలక్షేపం చేశాడు…. పది నిముషాలకు మరి ఏ విజ్ఞానం వెలిగిందో లేక తీసుకుంటున్న జీతానికి అప్పుడప్పుడు పని చెయ్యాలనిపించిందో… చెక్కుబుక్ ను చూసి ఆ రిజిష్టరులో.. సంతకము తీసుకొని చెక్ బుక్ నా చేతి కిచ్చాడు.
అంటే నేను బ్యాంకు వచ్చిన గంటకు, అక్కడ డబ్బుకై పని చేసే వారిని, వారి పని వారిని చెయ్యమని బ్రతిమిలాడితే గంటకు నాకు చెక్ బుక్ చేతికి వచ్చింది.
బత్రుకుజీవుడా!! అని వూపిరి పీల్చి క్యాష్ రాసి కౌంటరులో ఇస్తే…. మళ్ళీ రెండు చొట్లకు తిప్పి అంత క్యాషు ఇవ్వబడదు “ అని చావు కబురు చల్లగా చెప్పారు. రెండు లక్షలు తీసుకోవటానికి నేను గంటన్నరగా ప్రతి వెధవను బ్రతిమ్లాడితే నాకు చివరకు ఆ సబ్ మెనేజరు ఇచ్చిన తింగిరి సలహ ఎంటంటే… ప్రతి రోజు ఏటీఎమ్ లో డ్రా చేసుకు వుంచుకోవాలట క్యాషు.
“ఆహ!! ఎం షెప్పావమ్మ!!”” అంటూ పూలమాల వెయ్యాలి.
అంత గొప్ప హృదయాలకు… … వాళ్ళందరి చేత వంద పేజీలు “customers is god” అని చూచిరాత రాయించాలి….
అంత నిర్లక్ష్యంగా… కస్టుమరు అంటే గౌరవము లేకుండా.. పనికి ఎందుకు వస్తారో , ఎందుకు మన ప్రాణాలు తింటారో… ప్రతి వెదవను మనం బ్రతిమిలాడాలి మన డబ్బు మనం తీసుకోవటానికి….
చివరకు మేనెజరు దగ్గరకు వెళ్ళి నా ట్రంపు కార్డు వాడి డబ్బు తెచ్చుకున్నా.
అలా ఆంధ్రాబ్యాంకు వారు నా సహనం పరీక్షీంచారు… నా ట్రిగరు నొక్కారు.
అది నా చివరి ట్రాన్సక్షన్ వాళ్ళతో…. నాకు అలాంటి అగౌరవ పరచు వ్యక్తులతో నడపబడుతున్న బ్యాంకుతో నేను లయాల్ గా వున్ననంటే నాదే తప్పు. మనం వెడితే కూర్చోవటానికి ఒక కుర్చీ కూడా సరిగ్గా వుండదు. వచ్చే ప్రజల మీద కనీస గౌరవము వుండదు అందులో వున్నవారికి. హైద్రాబాదు నుంచి వచ్చే ముందు నా బ్యాంకును పూర్తిగా మార్చుకొని వచ్చేశాను.
ఆంధ్రాబ్యాంకు, అదో పరమ నాసి రకపు చెత్త సరుకు. ప్రభుత్వేతర సంస్థలలో ఇంత బద్దకము నిర్లక్ష్యం వుంటే ఇక ప్రభుత్వ సంస్థల సంగతి…పెరమాళ్ళు కెరక…
# ఇక్కడ ఈ రోజు పని మీద బ్యాంకు కు వెళ్ళితే వాళ్ళు గుర్తు చేశారు నేను ఎంత ముఖ్యమైన ఖాతాదారునో.
నిజంగా మనుష్యులను అందునా ఖాతాదారులను గౌరవించని ఏ సంస్థ అయినా ఎంత కాలము మనకలవు?
నాకు ఇండీయా అంటే ఎంత ఇష్టమైనా ఇలాంటి విషయాలు పంటి క్రింద రాయిలా, కంటిలో నలుసులా కలుక్కుమంటూనే వుంటుంది ఇలాంటివి నాకు… ఇండియా వెళ్ళాలంటే….