డిన్నరు ఐడియాలో

మన మిత్రులు మన ఇంటికి  ముందుగా చెప్పకుండా రావటం అన్నది 10 సంవత్సరాలకు పూర్వం సర్వ సాధారణ విషయము. చుట్టాలు వచ్చే ముందు కొన్ని సార్లు ఉత్తరాలు రాస్తే వారు. మన పాత సినిమాలలో చూడండి, అప్పుడే లెటరు ఇచ్చి వెడతారు, మరు క్షణం కారులో స్టేషనుకు వెడతారు సూర్యకాంతం గారి కారు చోదకుడు. 
మరి కొన్ని సార్లు అల్లుడు వచ్చి రుసరుస లాడుతాడు. వస్తున్నా మని లేఖ రాసినా కారు పంప లేదని. మరు క్షణం లెటరు వస్తుంది, బలానా రోజు వస్తున్నామని.  అవి వేరే వూర్లలో వుండే అతిథుల గురించి. 
ఉన్న ఉర్లో ఉంటే, ఫోన్ చేసి వస్తారు. ఫోన్ లేనప్పుడు ఏమి చేసేవారో నాకు గుర్తుకు రావటము లేదు. నా చిన్నప్పుడు ఫోన్ ఉండేది కానీ, వాడకం తక్కువ. అందరి ఇళ్లలో ఉండేది కాదు కదా. 
ఇప్పుడు మర్యాదలలో కొంత మార్పు వచ్చింది. మనం ముందుగా చెప్పటమే కాదు, వారికీ కుదురుతుందా లేదా అని అడిగి, వారి సమయాన్ని బట్టి సందర్శిస్తున్నాము. 
అమెరికాలో అయితే వారాంతరం తప్ప, సందర్శకులను, మిత్రులను  మనం కలలో కూడా వారము మధ్యలో ఊహించలేము. 
కానీ ఒక్కోసారి ఇక్కడ కూడా మిత్రులు మనలను వారములో చూడవస్తారు. అంటే, వారు ఎదో పని మీద వచ్చి, వూళ్ళో మనము వున్నామో లేదో చూసి, వుంటే టక్కని చూసి వెడతారు. అలాంటప్పుడు మనమురాకోయి అనుకోని అతిథిరాకోయి …” అని పాడలేము. వచ్చిన వారికి మన వీలు బట్టి కాఫీలు, టిఫినులు సర్దుతాము కూడాను. 
ఆలాంటి సమయాలలో ఎలా మనం వారికి భోజనాలు, గట్రా ఏర్పాటు చెయ్యాలి?
ఎలాంటి అతిధి మర్యాదలు అందించాలి?
ఇలాంటి సందర్భం మధ్య నాకు ఏర్పడింది. 
అది ఎలాగంటే : 
మొన్న గురువారం నేను పని మీద బయటికి వెళ్లి వచ్చేసరికే మావారి మిత్రులు వచ్చి ఉన్నారు. శ్రీవారు నా వద్దకు వచ్చి వారు భోజనానికి ఉంటే పర్వాలేదా? అని అడిగితే, నేను సరే అంటి. మాములుగా మాకు అలా జరగదు. కానీ వాళ్ళు వారాంతరము రావలసింది ఎదో మార్పు వల్ల ముందుగానే వెళ్ళిపోతున్నారని, కొద్దిగా homemade indian ఆహారము కోసం ఆర్రులు చాచి వచ్చారు మా ఇంటికి. నేను బయట పని మీద వెళ్ళి వచ్చేసరికే వచ్చి వున్నారు. 
వాళ్లంతా వాళ్ళ గోలలో రాజకీయాలలో టంప్ విషయాలలో మునిగి పోయారు. 

ఎదురుగ మనుష్యులు ఉన్నారు కాబట్టి, త్వరగా ఒక గంటలో విందు భోజనం ఏమి పెట్టాలా? అని ఆలోచించి, కొద్దిగా జీరా రైస్ తో పాటు, మిర్చికా సాలన్‌, దాల్తడకా చేసి, వడ్డించాను. ఆవకాయ ఉండనే ఉంది నంచుకోవటానికి. 
మొత్తానికి ఒక గంటలో అన్నీ టేబుల్ మీదికి అమర్చాను.  

ఇలా ఎప్పుడైనా అనుకోని అతిధి వస్తే మనం హడావిడి పడకుండా, మంచి సువాసనలతో జీరా రైస్ చేయొచ్చు. అది బిర్యానిలా చాలా టైం పట్టదు. తేలిక. హాయిగా అరుగుతుంది. పైపెచ్చు జీరా ఆరోగ్యానికి మంచిది కూడా. 
పెద్ద మిరపకాయలు ఉంటె సరే లేకపోతె, దాల్తడకా, లేదండి చోలేతోనో వడ్డించి మీరు అతిధిని ఆనందింప చేయవచ్చును. మనమురాకోయిఅని పాడనక్కర్లేదు. 

జీరా రైస్ రెసిపీ :

జీరా రైస్ కి కావలసిన పదార్థములు; 
2 కప్పుల బాసుమతి రైస్ 
1 స్పూన్ నెయ్యి 
3 స్పూన్ల జీరా 
2 లవంగాలు 
2 ఇలాచీ 
1 చిన్న దాల్చన చెక్క ముక్క 
1/2 ఉల్లిపాయ సన్నగా తరుగుకోవాలి. 
1 చెంచా జీడిపప్పు 
ఉప్పు తగినంత . 
ఉంటే పచ్చి బఠాణి కూడా 2 చెంచాలు కలపవచ్చు. 
బియ్యం కడిగి పెట్టుకోండి ముందు. 
బాండి లో  నెయ్యి వేసుకొని, అందులో 2 చెంచాలు జీరాను, 
2 లవంగాలు, ఇలాచీ, ఒక చిన్న దాల్చాన చెక్క, 1/2 ఉల్లి పాయ సన్నగా తరిగిన ముక్కలు, 1 చెంచా జీడీ పప్పు వేసి వేయించుకోవాలి. 
వేయించిన  మొత్తంని 2 కప్పుల బాసుమతి బియ్యం తో కలిపి ఎలక్ట్రిక్ కుక్కర్ లో పెట్టి 3 కప్స్ నీరు, 1 కప్ పాలు పోసి,  రైస్ వండుకోవాలి. 

జీరా రైస్  ప్రిపరేషన్ కి 5 నిముషాలు పడుతుంది. ఎలక్ట్రిక్ కుక్కర్ లో 15 నిముషాలలో అయిపోతుంది. కాబట్టి వడ్డనకు 20 నిముషాల ముందు ఇది సిద్దం చేసుకుంటే, వేడిగా వడ్డించ వచ్చు. 
—————————-
మిర్చికా సాలమ్రెసిపీ
————————–
కావలసిన పదార్థాలు :

లావు మిరపకాయలు 5
1/2 కప్ వేరుశనగ పప్పులు 
2 చెంచాలు నువ్వులు 
2 చెంచాల ఎండు కొబ్బరి 
1 చెంచా సోంపు పొడి 
1 కప్ నూనె 
4 ఎండు మిరపకాయలు 
చిటికెడు పసుపు 
కొద్దిగా చింతపండు పులుసు 
1/2 కప్ పెరుగు 

ముందుగా మిరపకాయలను మధ్యలో ఒక వైపు గాటు పెట్టి, లోపలి గింజలు తీసివేయ్యాలి. 
వీటిని మునిగేలా నీరు నింపి మైక్రోవేవ్ లో 5 నిముషాలు ఉడికించాలి. అప్పుడు మిర్చి కారం తగ్గుతుంది. మెత్తగా కూడా అవవు. 
బాండీలో వేరుశనగ పప్పు, నువ్వులు, కొబ్బరి డ్రై గా వేయించాలి. ఇందులో ఎండు మిరపకాయలు 2, పసుపు, ఉప్పు, కాస్త చింతపండు నీరు  కూడా వేసి మసాలా సిద్దం చేసుకోవాలి. 
మిశ్రమాన్ని మిరపకాయలలో నింపాలి. మిగిలిన మిశ్రమాన్ని  ప్రక్కన వుంచాలి. 
బాండీలో నూనె పోసి కొద్దిగా తక్కువ మంటలో స్టవ్ ఉంచి మిరపకాయలు నూనెలో ఉంచాలి. మిగిలిన మసాలా పేస్ట్ ను నూనెలో కలిపెయ్యాలి. 
సన్నని సెగమీద తిప్పుతూ 20 నిముషాలు ఉంచాలి. 
అప్పటికి నూనె పైకి తేలి మిరపకాయ మెత్త పడి మసాలా కాయలోకి ఇంకుతుంది. 
అప్పుడు పెరుగును పల్చగా చేసుకొని, 1/2 స్పూన్ నిమ్మరసం, సోంపు పొడి  కలిపి కూరలో కలిపెయ్యాలి. 
మూట పెట్టి 5 నిముషాలు ఉంచి, స్టవ్వు మీద నుంచి దించెయ్యాలి.  ఇది మరో డిష్ లో కి మార్చి వేడిగా ఉన్న జీరా రైస్ తో వడ్డించటమే. 
కూరకు మొత్తం పట్టె సమయము 40 నిముషాలు. 

—————
దాల్ తడాకా 
దాల్తడకా కూడా చాలా ఈజీ గా చెయ్యవచ్చు. మీకు రెస్టురెంట్స్ లో ఉండే రుచి వస్తుంది. జీరా రైస్ తో కానీ మరో రైస్ తో కానీ దాల్తడకా చాల బాగుంటుంది. 
ఒక కప్పు పెసరపప్పు ఉడకేసి, బాండిలో తాళింపు, కొత్తిమీర వేసుకొని, అందులో సగం ఉడికిన పప్పును కలిపి, పసుపు, ఉప్పు వేసి స్టవ్వు మీద 10 నిముషాలు సన్నని సెగ మీద ఉంచటమే. 
స్టవ్వు మీదనుంచి దింపాక నిమ్మరసం కలిపి వడ్డించటమే తరువాయి. 

ఇలాంటి కొన్ని క్విక్ రెసిపీ లు మిర్చి కా సాలన్ కొద్దిగా టైం తీసుకున్నా, దాని స్టవ్ మీద పెట్టక, మిగిలినవి చూసుకుంటే, అన్నిటిని కలిపి 45 నిముషాలలో తయారుచేసుకొని అతిథికి వడ్డన చెయ్యొచ్చు. 
మిత్రులు హ్యాపీ గా తింటారు. 
మన ఇంట్లో వారు హ్యాపీ గా ఉంటారు. సడన్ గా వచ్చిన అతిధులు మూలంగా మనం ఇబ్బంది పడలేదని

Leave a comment