katte pongali

మరో రోజు ప్రారంభం, తప్పదు మనకు వంటింటి తో సహవాసం. ఇంత పెద్ద వంటగది పెట్టుకున్నది మరి అందుకే జంజాటము… వంటింట్లో ఉండటం తప్పదు, అటు – ఇటు గిరగిరా తిరగలిలా తిరగటమూ తప్పదూ. గడబిడి లేకుండా ఆ మూల నుంచి ఈ మూలకూ తిరిగితే కొంత వర్కౌట్, సందులో సడేమియాలా కాస్త కమ్మనివి వండవచ్చు! ఫ్రైడే (శుక్రవారము) వచ్చింది. థాంక్స్ గాడ్ ఇత్స్ ఫ్రైడే(ThankGod Its Friday) అనటానికి లేదు. ఈ రోజు మరింత పని,…

Akakarakai pulusu

తెల్లారింది మొదలు మానవులకు తిండిగోల తప్ప మరోటుండదా అని దిగులేస్తుంది ఒక్కోసారి. ఈ ఉదయము శ్రీవారు నాతో “టిఫెను పెట్టు ఆఫీసుకెళ్ళోస్తా’ అన్నాడు. ఈ చద్దిపెట్టె( ఇలా అనమని మిత్రులు సలహలిచ్చారుగా) లో భద్రంగా వున్నాయి పూరీ కూరా తినెయ్యరాదూ’ అని అర్థించాను. “ఏ యూగాలనాటివి అవి” “త్రేతాయగమనుకుంటా’ “అయితే ఆర్కేయాలజీ వారికి పంపు… నాకు మాత్రం ఎదైనా టిఫిను పెట్టు’ అన్నాడు షార్పుగా. ఈ ఉదయమే ఓ ఉప్మా కథ చదివారు. అది గుర్తుతెచ్చుకుంటూ ‘ఆఫీసుకు…

ఆవకాయ ప్రహసనము

ఎవ్వరిని పలకరించినా ఊరగాయ కథలు ఊరించి, ఊరించి చెబుతున్నారు. అందరి గోడలకు రంగులు మారి ‘త్రి మ్యాంగో’ కారం తో ఘాటుగా నిండిపోయింది. మహామహా వంటగాళ్ళ, మామూలు వంటగాళ్ళు, వాసన తెలిసిన వంటగాళ్ళు, బద్దకపు వంటగాళ్ళు అని నాలుగు విభాగాలు చెయ్యాలి అసలు అందరిని. అందులో అట్టడుగున ఉన్న చివరి రకంకి చెందిన నేను, అంటే – వంటే రాదు కానీ, బద్దకమని ముసుగులో పరువు కాపాడుకునే బాపత్తన్నమాట. నాలాంటి వాళ్ళకి రోజూ వంటే ఎవరెస్టు ఎక్కటం,…

కమ్మని కాకర పులుసుకూర

కాకరకాయ అంటే కేవున కేక వేసి కనపడకుండా మయామయ్యేవారము మా చిన్నప్పుడు. నేను చిన్నతనములో కాకరంటే కళ్ళు తేలేసి, కొంకర్లుపోయి, తినకుండా కనుమరుగయ్యేదాని. అమ్మ సన్నగా తరిగి కమ్మగా, దోరగా వేయ్యించి పంచదార చల్లినా వద్దంటే వద్దని గొడవ చెయ్యటము మా జన్మహక్కుగా వుండేది కుర్రతనమున. కాని ఒకసారి ఇది తిన్నాను. నా కాలేజిలో నేస్తాలు పెట్టారు. పేరు తెలియని కూర కమ్‌ పులుసను, తిన్నాను కడుపార,తరువాత కనుకున్నాను కాకరిదని, ఇంత కమ్మగా చెయ్యవచ్చని.  ఇది కాకర…

మన వంటగది ఒక ప్రయోగశాల:

మన వంటగది ఒక ప్రయోగశాల: ఇది నిజం కూడాను! చాలా సార్లు నిరూపించబడినది కూడా!! నిన్నటి ఉదయం శ్రీవారు వంటగదిలోకి వచ్చి “ఏంటి వండుతున్నావు ఈ రోజు?” అని అడిగారు. ఆయన కళ్ళలో భయం నాకు స్పష్టంగా కనిపించింది. నా వంటంటే భయం కాదు అది. నా వంటకు భయపడటం మానేసి చాలా కాలమే అయ్యిందిగా! ఏదో సామెత చెప్పినట్లుగా, రోజూ చచ్చేవాడికి ఏడ్చేవాడు ఉండడని, నా వంటకు ఎంతకాలం భయపడుతాడు చెప్పండి పాపం మానవుడు! సరే…