Swamy samartha

యోగులుపరమాత్మ ప్రతిరూపాలు 

అక్కల్ కోట శ్రీ స్వామి సమర్థ :

తపఃసంపన్నులైన రుషులు, సిద్ధ యోగులు, పరమాత్మ ప్రతినిధులు.
భారతావనిలో నడయాడిన ఎందరో మహానుభావులు నేలను, గాలిని పవిత్రం చేసి, భక్తులను కరుణించి మోక్షమిచ్చారు. నమ్మిన వారికి నేటికీ ఇస్తున్నారు. 
ఇలా నడయాడిన మహనుభావులలో కొందరు దత్తస్వామి అవతారాలుగా ప్రసిద్ధి చెందారు. వారు ఉన్నప్పుడే కాక, నేటికీ నమ్మి వచ్చిన భక్తులకు కరుణతో బ్రోచి, కష్టాలలో సేద తీర్చి, మోక్షం వైపు నడుపుతున్నారు. 
అలాంటి మహాయోగులలో శ్రీ దత్తుని నాల్గవ అవతారంగా ప్రసిద్ధికెక్కి, అక్కల్కోట ను పుణ్య క్షేత్రంగా మలచిన సిద్ధయోగి, సమర్థ గురువులు శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ. వారినేశ్రీ అక్కల్ కోట స్వామిఅని కూడా అంటారు. 
శ్రీ స్వామి సమర్థ గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే. భగవన్తుని లీలలు అనంతం. వాటిని తెలుసుకునే కొద్దీ, ఇంకా తెలుస్తూనే ఉంటాయి. అలానే శ్రీ స్వామి సమర్థ లీలలు అంతు లేకుండా, కడు విచిత్రంగా ఉంటాయి. మానవ మేధకు అందకుండా ఉంటాయి. స్వామి పుట్టుక, పెరిగిన విధానం, చదువు అన్ని అగోచరములే. 
అశ్వని మాస 1856 సంవత్సరం స్వామి మొదటి సారి అక్కల్కోట లో కనిపించారు. ఆనాటి నుంచి వారు అక్కల్కోట లోనే ఉండిపోయారు. వారి గురించి భక్తులు వివరాలు అడిగితేఒకసారి తమ తల్లి తండ్రులుమాదిగ వారుఅన్నారు. మరొక భక్తునితోయజుర్వేద బ్రాహ్మలమనిచెప్పారు.  మరొక భక్తునితోమూలపురుషుడువటవృక్షం, మూలానికి మూలంఅన్నారు. కుల మతలాకు అతీతమైన భగవంతుని రూపమని చెప్పటానికి ఇలా చెప్పి ఉంటారు. 

స్వామి సమర్థను భక్తులు గాణ్గాపుర వాసి అయిన  ‘శ్రీ నృసింహ సరస్వతివారి అవతారంగా నమ్ముతారు. శ్రీ స్వామి సమర్థ అక్కల్ కోట రాక పూర్వం దేశం నలుదిశలా పర్యటించారు. బదిరి, కేదార్, హరిద్వార్, గంగోత్రి, వారణాసి, కలకత్తా, పూరి, ఉడిపి, పండరినాథ్, గిర్నార్, మాతాపూర్, నరసింహవాడి, రామేశ్వరం ఇలా ఎన్నో చోట్లు వారు పర్యటించారని చెప్పారు. భక్తులు కొందరు వారిని అక్కడ, ఇక్కడ చూసి ఉన్నారు కూడా. 
వివిధ క్షేత్రాలలో స్వామి భక్తులకు రకరకాలైన అనుభవాలు ఇస్తుండేవారు. ఒక సారి కొందరు భక్తులుపూరిచేరి దర్శనం చేసుకొని లోపల జ్వరంతో మూలుగుతూ భగవంతుని స్మరిస్తూ ఉండిపోయారు. గదిలోకి మెరుపు మెరిసి శ్రీ స్వామి సమర్థ్ ప్రత్యక్షమయ్యారు. వారికి వెంటనే స్వస్థత కలిగింది. వారి ఆకలి కూడా తీర్చి స్వామి అదృశ్యమయ్యారు. మరో భక్తునికి పూర్వజన్మ శృతి కలిగించి తన పూర్వపు జన్మలోనృసింహ సరస్వతిఅని నిరూపించారు. సంఘటనలు ఆళాని బువా అన్న సాధువు ద్వారా మిగిలిన భక్తులకు తెలిసింది. 
అక్కల్కోట వచ్చినప్పుడు స్వామి మొదట కండోబా ఆలయం వద్ద ప్రకటితమైనారు. అక్కడి తహసీల్దార్ స్వామిని పిచ్చివాడని నమ్మి వుట్టి కాళీ చిలుము తెచ్చి పీల్చమని ఇస్తాడు. స్వామి ఏమి మాట్లాడకుండా చిలుముకి అగ్గి పెట్టి పీలుస్తాడు. హుక్కా పొగ రావటం చూసి స్వామి సిద్ధ పురుషుడని గ్రహించి ఖాన్ తప్పు క్షమించమని వేడుకుంటాడు. చోళప్ప అన్న భక్తుని ఇంట స్వామికి భోజనం ఏర్పాటు చేస్తాడు. ఆనాటి నుంచి స్వామి చోళ్ళప్ప ఇంటనే ఉండిపోతారు. స్వామి హిందువు భక్తులను, మహ్మదీయ భక్తులను భేదభావం లేకుండా చూసేవారు. 

స్వామికి భక్తులకు భోజనం పెట్టటమంటే ఏంతో  ప్రీతి. ఒకసారి స్వామి రాంపుర అన్న గ్రామం వెళతారు. భక్తుడు రవాజి స్వామి ఆగమనవిందుగా 50 మందిని పిలుస్తాడు. కానీ స్వామిని చూడటానికి చుట్టుప్రక్కల గ్రామాల నుండి భక్తులు వందలలో కదిలి వస్తారు.  రవాజి భక్త సముద్రాన్ని చూసి కంగారు పడటం జరుగుతుంది. స్వామి మాత్రం చెక్కుచెదరక రవాజి ని కాళీ బుట్టలు తెమ్మని చెబుతారు. బుట్టలలో శివ, అన్నపూర్ణ దేవతల మూర్తులను పెట్టి, పైన రోటి, అన్నం వంటి ఆహారంతో నింపుతారు. బుట్టలను తులసి మాత చుట్టూ మూడు సార్లు తిప్పించి, బుట్టలను కప్పి, చూడకుండా వడ్డన చెయ్యమని స్వామి ఆజ్ఞాపిస్తాడు. అలానే రవాజి వచ్చిన భక్తులకు వడ్డిస్తారు. ఆనాడు భక్తులు వందలలో భోజనం చేస్తారు. చిట్టచివరకు స్వామి సమర్థ భోజనం చేసిన తరువాత చుస్తే, వండినది వండినట్లుగా ఉంటుంది. ఇదిఅన్నపూర్ణ సిద్ధి‘. ఇదే లీల మనకు శ్రీ నృసింహ సరస్వతి స్వామి చరిత్రలో, శిరిడి సాయిబాబా చరిత్రలో కూడా చూడవచ్చు. 

శ్రీ నృసింహ సరస్వతి స్వామికి, మన అక్కల్కోట స్వామి కి కొన్ని చిన్న బేధాలు కనపడుతాయి. అక్కల్కోట స్వామికి ఎటువంటి ఆశ్రమాలు లేవు. అంతమాత్రాన స్వామి సన్యాసి కారని కాదు. పరమహంస, తురీయాతీత, అవధూత సంప్రదాయానికి దండం, కమండలు, కాషాయం ఆవశ్యకత లేదు. ఆధ్యాత్మిక పరిపూర్ణత పొందిన కొందరినిఅత్యాశ్రమిఅంటారు. వీరు బ్రహ్మచర్య, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాలకు అతీతంగా ఉంటారు. నియమ నిబంధనలు వారికి చెందవు. మన అక్కల్కోట స్వామి అలాంటి కోవకు చెందిన వారు. 

శ్రీ స్వామి ఎప్పుడు బ్రహ్మానందంలో మునిగి ఉండేవాడు. ఆయన రూపం విచిత్రంగా ఉండేది. ఈయన వయో వృద్ధులైన, అవధూత అయినప్పటికీ ఆయన శరీరం ఎక్కడ ముడతలు ఉండేవి కావు. స్వామి సర్వజ్ఞులైనప్పటికీ పసి పిల్లలవలె చేష్టలు ఉండేవి. బ్రహ్మానందంలో ఉన్మత్తావస్థలో ఉన్న స్వామి ఎవ్వరిని లక్ష్య పెట్టేవారు కారు. 
స్వామి చాలా పొడుగు. ఆజానుబాహులు. దాదాపు 7 అడుగులు పొడుగు ఉండేవారు. పెద్ద బొజ్జా, విశాలమైన భుజాలు, తీవ్రమైన దృష్టి. స్ఫురద్రూపి. గోధుమవన్నె శరీరఛాయతో ఉండేవారు. పెద్ద చెవులు. పదాలు పొడుగా ఉండేవి. స్వామి ముఖాన తిలకం మెడలో స్పటికపు మాల, తులసి మాల రుద్రాక్షలు ధరించేవారు. కౌపీన ధారి. 
చెవులకు ప్రవాళం పొదిగిన కుండలాలు ఉండేవి. 
ఒక్కొక్కప్పుడు వేదాలు, శ్లోకాలు, భజనలు ఆయన నోటి వెంట వచ్చేవి. ఒక్కొక్కప్పుడు వంటికి గంధం రాచుకొని హారతి ఇప్పించుకునేవారు. తరచూ చిన్నపిల్లలతో కలసి ఆడుతూ ఉండేవారు. 
ప్రతి ఉదయం రెండుసార్లు ఆచమనం చేసేవారు.

స్వామి సర్వజ్ఞులు. ఎవ్వరు ఏమి ఆలోచించినా ఆయనకు తెలిసిపోతుంది. ఒకసారి ఒక భక్తుడు సన్యాసి అయిన స్వామి ఇన్ని భోజన పదార్థాలు తినటమేమిటి? అని మనసులో అనుకుంటే, ఆనాడు స్వామి పచ్చిశెనగలు తిని నీరు త్రాగి ఊరుకున్నారు. స్వామి భక్తుల పాలిటి కల్పవృక్షం. ఆయన భక్తుడైన జ్యోషి నిత్యంపంచదశిగ్రంధం పారాయణం చేసేవాడు. ఒకరోజు ఒక జఠిలమైన శ్లోకానికి అన్వయం తెలియక జ్యోషి పారాయణం నిలిచిపోతుంది. ఆరోజు జ్యోషి, తన మిత్రులు పారాయణం ఆపి స్వామి దర్శనానికి వెడతారు. ఆనాడు స్వామి వారిని కూర్చోబెట్టి వేదాంతబోధ చేశారు. బోధ అంతా ఆనాటి శ్లోకం అర్థమే!! స్వామిని నమ్మిని వారు ఏమీ ప్రేత్యేకంగా కోరవలసిన అవసరంలేదు. అన్నీ స్వామికి తెలుస్తాయి. 

స్వామి దర్శనానికి గొప్ప సిద్ధపురుషులు కూడా వివిధ రూపాలలో వస్తూ ఉండేవారు. ఒక రోజు తోటలో కూర్చున్న స్వామి భక్తులతో అకస్మాత్తుగా లేచి, “రండి మీకొక మహాత్ముని చూపెడతానుఅన్నారు. యాభై గజాల దూరంలో పెద్ద పుట్ట వద్దకు తీసుకో పోతారు. అక్కడ పుట్ట నుంచి పెద్ద నాగుపాము వచ్చి స్వామికి పాదాభివందనం చేసి నెమ్మదిగా వెళ్ళిపోయింది. స్వామి పాము తో కొద్దీ దూరం నడచి వీడ్కోలు చెప్పారు. “ఆయన గొప్ప మహనీయుడుఅన్నారు స్వామి. 
స్వామిని విద్యాశ్రీ, రాజశ్రీ, సౌందర్యశ్రీ పరీక్షించి, ఓడి స్వామి ఆత్మ సౌందర్యంలో కరిగిపోయాయి. 
అక్కల్కోటలో ఒక మంగలి స్వామికి క్షవరం చేసి, గోళ్ళు తీసే వాడు. మంగలి తీసిన గోళ్ళను తాయత్తులో పెట్టి అమ్ముకునేవాడు. స్వామి శక్తి వలన ప్రజలను అనేక భాధలనుంచి తాయత్తులు రక్షించేవి. మంగలికి ధన లోభం ఎక్కువై భక్తి నశించింది. తాయత్తులు ఉపకరించటం మానుకున్నాయి. అతనా వృత్తి మానవలసి వచ్చింది. ఒక వేసవిలో ఊరిలో బావులన్ని ఎండిపోయాయి. చోళప్ప ఇంటిలోని బావి కూడా ఎండిపోతుంది. స్వామి బావిలో మూత్రవిసర్జన చేస్తారు. ఆనాటి నుంచి బావిలో నిండుగా నీరు ఉన్నాయి. నేటికి భక్తులు బావిని సందర్శించవచ్చు. 

1857 లో మొదటి సారి కోడాక్ కంపెనీ వారు స్వామిని ఫోటో తీశారు. ఫోటో లో స్వామి చుట్టూ పెద్ద కాంతిపుంజం ఉండటం వారిని ఆశ్చర్యపరిచింది. 
అప్పుడు మనదేశంలో ఫోటో లు లభ్యం అయ్యేవి కావు. ఖర్చు కేవలం మహారాజాలు మాత్రమే భరించేవారు. కోడాక్ కంపెనీ బొంబాయి లో ఆఫీస్ మొదలుపెడుతూ కంపెనీ పేరు కోసం స్వామి ఫోటో తీసి అడ్వాటైజు చెయ్యాలని ఆలోచించారు. నిపుణులైన ఫోటోగ్రాఫర్ ని స్వామి దగ్గరకు పంపారు. అతను స్వామి అనుమతి లేకుండా ఫోటో తీయాలని నిశ్చయించి, ఎంతో కష్టం మీద చిత్రం తీస్తాడు. ఫోటో చెప్పకుండా తీశానని గర్వపడతాడు. ఫోటో కడిగి స్వామికి చూపుతాడు. అది చూసి స్వామి నవ్వి చుట్టూ ఉన్న భక్తులకు చూపుతాడు. ఎవరి ఇష్టదైవం వారికి కనపడుతుంది. స్వామి ఫోటోగ్రాఫర్ కి చూపితే అందుకో కోతి బొమ్మ ఉంటుంది. 
ఫోటోగ్రాఫర్ కి బుద్ది వస్తుంది. స్వామి ఫోటోగ్రాఫర్ గర్వ మణచ ఇలా చేశారని అర్థమౌతుంది. స్వామిని శరణు వేడి మళ్ళీ ఫోటో తీస్తే, చక్కటి ఫోటో వచ్చింది. 

స్వామి ఎందరెందరికో ఆత్మోన్నతి నొసగి వారిని మహాయోగులుగా మలచారు.  స్వామి ఎందరో భక్తులకు తాను పూర్ణ దత్తావతారమని నిదర్శనం నిచ్చాడు. 
ఆకాశంలో చుక్కలు లెక్కపెట్టవచ్చు కానీ, పరమాత్మ లీలలు లిఖించ ఎవరికీ సాధ్యం? 
స్వామి నిర్యాణం చెందబోయే ముందుగా చూచాయగా భక్తులకు సూచించేవారు. స్వామి తను నిర్యాణం చెందబోయే ముందు జంగాల మఠానికి వెళ్ళి లింగాలకు పిడకలు పేర్చి నిప్పు పెటించారు. తాము ప్రతిష్టించుకున్న లింగాలను కలుస్తున్న స్వామిని ఏమి అనలేక జంగాలు కేకలు వేసుకున్నారు. మరు రోజు బూడిద తొలగిస్టే కాంతివంతమైన లింగాలు దర్శనం ఇచ్చాయి. నిర్యాణానంతరం తాను మరింత ఉజ్జ్వలంగా ఉండబోతున్నామని సూచన అని భక్తులు తలచారు. 

ఆయన నిర్యాణానికి నాలుగు రోజుల ముందు జ్వరం రావటం మొదలైంది. ఆయన మామిడి తోటకు బదిలీ అయ్యారు. భోజనం మానివేశారు. స్వామి అప్పుడేమా వనానికి వెళ్ళాలిఅని అనటం మొదలెట్టారు. 
నేను సర్వత్రా ఉన్నాను , పిలిస్తే పలుకుతానుఅని చెప్పారు. మర్రి చెట్టు మొదట్లో పద్మాసనం వేసుకు కూర్చున్నారు. అలాగే శరీరాన్ని విడిచారు. స్వామిని అలానే ఊరేగించి, చోళప్ప ఇంటి ఎదురుగా సమాధి కట్టారు. దానినిచోళ్ళప్ప మఠంఅంటారు. 
అనంతకోటి బ్రహ్మాండనాయక, రాజాధిరాజ, శ్రీ స్వామి సమర్థ అక్కల్కోట మహారాజ్ కీ జై“! అని భక్తులు ముక్త కంఠంతో కేకలు వేశారు. 
స్వామి సమాధి తరువాత కూడా భక్తులకు దర్శనం ఇచ్చి, రక్షిస్తున్న సంఘటనలు కోకొల్లలు. 

అక్కల్కోట స్వామి సమర్థ కి, శిరిడి సాయినాథునికీ ఎన్నో పోలికలు ఉన్నాయి. వారిరువురి చిన్నతనం, కులం గోత్రం తెలియదు. ఇరువురు దత్త సంప్రదాయం పాటించారు. ఇద్దరు స్థానికి కండోబా దేవాలయం వద్ద ప్రకటితమైనారు. ఇద్దరిని ముందు ఒక మహ్మదీయ భక్తుడు ఆదరించాడు. ఇద్దరు భక్తులను అనుగ్రహించటంలో తిట్లు, దెబ్బల వంటి విచిత్ర పద్ధతి పాటించారు. సకల దేవతలు తామే అని భక్తులకు చూపించారు. ఎందరు భక్తులకు ఆత్మోన్నతి కలిగించి, యోగులుగా తీర్చిదిద్దారు. 
వీరు సమాధి తరువాత కూడా భక్తులకు అందుబాటులో ఉన్నారు. 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s