Dream

చిమ్మ చీకటి..చలి….చుట్టూ. 
కరెంటు లేదు. క్యాండిల్ వెలుతురు. 
ఆకలి అంటూ పిల్ల ఏడుపు. పొయ్యి వెలిగించటానికి చలికి కుదరటం లేదు. కష్టపడి పొయ్యి రాజేసి అన్నం కోసం ఎసరు గిన్నె ఎక్కించాను. 
వెనకటి రోజులు నయం. ఎలట్రిక్ కుక్కర్‌ లో అన్నం, ఇన్‌సంట్‌ పాటులో సాంబారు వండేవాళ్ళము. వెచ్చటి ఏసిలలో బ్రతికాము. ఎక్కడికన్నా బుర్రని కారులో వెళ్ళేవారము. 
ఫోను వాడేవారము
ఇప్పుడు ప్రపంచం తల్లక్రిందులై య్యింది
 నా కారును నేను వంటచెరుకు పెట్టడానికి  వాడుతున్నా
మా గుర్రంబండిని మొన్ననే ‘పీటా’ వారు జంతు హింస అని తీసుకుపోయారు. 
శ్రీవారు నడిచి రావాలి పదిహేను మైళ్ళు. 
సైకిలు టైరు మార్చలేదు కాబట్టి ఆ శ్రమ. లేకపోతే సైకిలు పై వచ్చేవారు తను. 
మా మారిన రోజులను దిగులుగా చూస్తున్న నాకు ఫిలడోప్పియా అమిష్‌ వారి జీవితం నయమైనదనిపించింది. వారు తమ జీవితాలలోకి నాగరికతతో వచ్చిన మార్పును రానియ్యలేదు. కాబట్టి వాళ్ళను నేడూ మునుపు లేదా లేదు. 
అన్నము గిన్నెలలో వండటము కుక్కర్లో కాకుండా మధ్యే నేర్చుకున్నా. కుదరటం లేదు సరిగ్గా. రోట్లో పచ్చడి దంచాలి. రోలు కడిగానో లేదో. అన్నీ పనులు చేసి తిని, మళ్ళీ వండుకొని, కడుక్కొని, వండుకొనిజీవితమింతేనా అని దిగులుతో ఏడుపొచ్చేస్తోంది…..
వెక్కి వెక్కి ఏడుస్తున్నాను…..’
ఏడుపు పెడుతుంటే మెలుకువ. 
అర్థం కాలేదు సరిగ్గా
అటూ ఇటూ కదిలాక  పూర్తిగా మెలుకువ వచ్చింది. 
పైన ఫ్యాను తిరుగుతోంది. 
బెడులైటు వెలుతురు.
పరుగున క్రిందికి వచ్చాను
మా కిచెను సేఫ్
బయటకు పరిగెత్తాకారు సేఫ్..
గుర్రం బగ్గీ లేదు. 
హమ్మయ్య! అది కలవొట్టి పీడ కల….
కేవలం తినటానికే బ్రతికినట్లుగా….
అయినా ఎంత పీడకల కదూ….
అన్నీ వెనకకు తిరిగిపోయినట్లుగా
వంటావార్పు
బట్టలు ఉతకటము గట్రా…..
ఎంటి ఇంకో పని లేనట్టుగా….
దేవుడా….
మరీ చిరాకుగా అమీష్ వాళ్ళు ఎలా వుంటారో అసలు.
మా వారికి నా పీడకల గురించి చెబితే, ‘అందుకే మరి అలా రోటి పచ్చడని అతి వేషాలు వెయ్యకుఅన్నారు వుడికిస్తూ
నీవేగా అలా బావుందన్నావు, లోట్టలేస్తూ తిన్నావుఅని అమాయకంగా అడిగితే
చేసిపెడితే..తిని పెట్టానోయ్‌
అని ఒక చురకేశారు. 
వాళ్ళ తినటము కూడా మన కోసమేనా???
అమ్మో! నమ్మరాదే చెలిమగవారి మాట….

ఇంతకీ చెప్పలేదు కదూవంకాయలు కాల్చి, వెయ్యించిన తిరగమాత ఉప్పు లతో రోట్లో వేసి నూరాను
ఇలా కలను నూరుతున్నా మీ కోసం…:)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s