New year

జరిగిన కాలం
జారిన నీరు.
తిరిగి పట్టలేవు
ఒడసి త్రాగలేము.
జరిగిన యేడు
ఇచ్చిన అనుభవం
నిన్నుగా నిలపటానికి
నీలోకి చూడటానికి
చేసినదెంత?
చూసినదెంత?
నీ ప్రక్కవారి తప్పులను(నీ హ్రస్వదృష్టికి)
ఎగిరెగిరి చూసే నీవు
కనపడని డప్పేసుకున్న
మ్రోగుత్తున తోలుతుత్తి నీవు

నీవైపు చూసుకొని
నీవేమిటన్నది గ్రహించేందికు
చాలదీ జన్మం
జుట్టుకు రంగులద్దుకు…
నీ అసలురూపుకు రంగులద్ది
లోకాన్ని మురిపిస్తున్నానని
నిన్నునీవు మభ్యపరుస్తున్నావు.

ఇకనైనా జరిగిక కాలాన్ని
గౌరవంగా స్వీకరించి…
శరీరానికి వచ్చిన వయస్సును
హుందాగా స్వాగతించి
ఈ యేడైనా…
నిన్నునిన్నుగా గౌరవించుకో…
ఆత్మగౌరవపు అర్థం గ్రహించు….

Leave a comment