సొగసైన బిళహరి 

సొగసైన బిళహరి  మొన్నటి వారము నా నేస్తం వచ్చింది నన్ను కలవటానికి. చక్కటి గాయని అయిన తను నన్ను, నా సంగీత సాధన గురించి అడిగినప్పుడు, అదిగో అప్పుడు అందుకున్నాను నా విపంచిని.  సరే కానీయి, అంటూ ఆలపించింది బిళహరి లో. నాకు సాధన లేక కుంటూ పడుతూ, గాత్రంలో మాత్రం సాగించాను తన కూడా. మరి బిళహరి కున్న  బలమే అది. మంచి కోమలమైన రసభరితమైన రాగం. ఉదయమైనా, సాయంకాలంలోనైనా హాయిని పంచే సరస కోమల…

వసంత పంచమి

“యా కుందేందు తుషార హారధవళా యా శుభ్ర వస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభి ర్దేవైస్సదాపూజితా సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా’ మాఘ శుద్ధ పంచమి న వసంత పంచమి జరుపబడును. దీనిని శ్రీ పంచమి అని కూడా అంటారు. దీనిని సరస్వతీ జయంతి, మదన పంచమి అని కూడా అంటారు . సరస్వతీ దేవిని ఆరాధించే దినమే వసంత పంచమి. సరస్వతీదేవి నాలుగు చేతులతో అలరారుతుంటుంది. తెల్లని వస్త్రంతో,…

పార్టిలు చేసుకోవటానికి కిటుకులు

చిన్న పార్టీ లకు కావలసిన ఏర్పాట్లు  మనం మన ఇంట్లో పార్టీ అంటే హడావిడి పడటం సాధారణం. మన అతిధులు గుర్తుంచు కునేలా పార్టీని నిర్వహించాలని కోరుకోవటంలో తప్పులేదు. పైపెచ్చు అది మన కనీస బాధ్యత. దానికి ఏర్పాట్లు చేసుకోవటం, మనం కూడా ఆ పార్టీలో మిత్రుల సమక్షంలో సంతోషం పొందటం మన హక్కు కూడా. కొన్ని చిన్న చిన్న ఏర్పాట్లు ముందుగా చేసుకుంటే ఎలాంటి పార్టీ అయినా ఇబ్బందులు లేకుండా సజావుగా సాగిపోతుంది.  ముందుగా పార్టీ…

పూర్వపు కథలను కనుల ముందు నిలిపే ‘ప్రాచీన గాథాలహరి’

పూర్వపు కథలను కనుల ముందు నిలిపే ‘ప్రాచీన గాథాలహరి’ కొందరు రాసినవి ఎంత చదివినా అర్థం కావు. అది భాష కావచ్చు, అందులో చెప్పే విషయం కావచ్చు. కొంతమంది రచనలు వలిచిన అరటిపండులా మృదువుగా ఉండి, చకచకా చదింవించేస్తాయి. కొందరి రచనలు గ్రాంధికంగా ఉన్నా కూడా కధనం, రచనా శైలి లో పట్టుతో, సస్పెన్సును చివరి వరకు నడిపించిన విధానముతో ఒక పట్టున చదివిస్తాయి. అలాంటి రచనలలో, అంటే గ్రాంధికంగా ఉన్నా, చదివించే రచనలు చెయ్యటంలో శ్రీ….

పులిహోర

గుడిలో పులిహోరలా మనము చేసే పులిహోర వుండాలంటే? వైష్ణవ దేవాలయాలు ప్రసాదానికి ప్రసిద్ధి. అందునా పులిహోర. మనము మన పండుగలకు ఎన్ని చేసినా పులిహోర లేకపోతే పండగే కాదు. దక్షిణ భారత దేశపు వంటకాలలో ఎంతో ప్రముఖమైనది, పవిత్రమైనది పులిహోర. పులిహోరలు ఎన్నో రకాలు చెయ్యవచ్చు. చింతపండు, నిమ్మకాయ, దబ్బకాయ,మామిడి కాయ పులిహోర ఇత్యాదిని. గుడిలో చాలా మటుకు చింతపండు పులిహోర ప్రసాదంగా ఇస్తారు. అది రుచిలో కొద్దిగా తేడాగా మనము ఇంట్లో వండే పులిహారలా వుండదు….

Nivedana

ప్రణవమందు వర్ధి ల్లు ప్రణవ రూప జననీ పలుకు సంకల్ప రూపముగ నుండు బిందురూపా ‘పరా’ వాక్కువు – చలించిన భావముల రూపము ‘పశ్యంతి’ వాక్కువైతివి. భావములైన వాక్కులు రూపము గాంచిన ‘మధ్యమా’!! వ్యక్తమైతివి ‘వైఖరి’ వాక్కుగా వాగ్దేవి – జీవుల నాల్కలందు వెలసితివి వాణిగా ఆ ప్రణవమే రూపమై నిలచిన భగవతి’ సుషుమ్నలో తిరుగాడు అగ్నితత్త్వ అంతర్వాహిని ప్రసరిస్తూ ప్రవహిస్తున్న జ్ఞానమయి నన్ను , ఈ అజ్ఞాన తిమిరం నుంచి ప్రచండ చైతన్య సుజ్ఞానానందమైన బ్రహ్మమునకు…

Gift idea for men

ఎవరికైనా బహుమతి ఎవ్వరైనా ఏ కొలమానము బట్టి ఇస్తారు? వారు పిల్లలా? పెద్దలా? వారికి ఇష్టాలు ఏమిటి? అఇష్టమేమిటి! అని కదా చూసి ఇస్తారు. అదే పరిచయస్తులకు అయితే గిఫ్ట్ కార్డు ఇస్తారు. అది తీసుకున్నవారి అభిరుచి బట్టి వాడుకోవచ్చు. మాములుగా మన ఇంటికి ఎవరైనా వస్తే చీరలు, రవికలు పెడతాము. లేదా పండు చేతిలో పెడతాము. అదే అబ్బాయిలే వస్తే? వారికి చేతిలో ఎం పెడతాము? పుట్టినరోజులు, కొన్ని ప్రత్యేకమైన రోజులకు పురుషులకు గిఫ్ట్ గా…

పద్యాలు-  చెణుకులు – చాటువులు. 

తెలుగు భాషలో పద్యం ఒక విశిష్టమైన విశేషమైన ప్రక్రియ. పద్యం తో భాషకు ఎన్నైనా సొగసులద్దవచ్చు.  ఎంత వచన కవిత్వం అలల మాదిరి సాగిపోయినా, పద్యం తెలుగు భాషకి  ఉన్న  అత్యుత్తమమైన ఆభరణాలలో ఒకటి! చెణుకుల పద్యాలూ, చాటువులు, తిరకాస్తు పద్యాలూ, పొడుపుకథ పద్యాలూ తెలుగులో విరివిరిగా ఉన్నా, పద్యాలను చదవటం అందరూ ఇష్టపడరు. అంతెందుకు తెలుగునాట మారుమోగి పోయిన కృష్ణ రాయబార పద్యాలు నేడు ఎక్కడా కనిపించవు, వినిపించవు. పద్యం తెలిసిన వారు క్రిందటి తరానికి పరిమితమౌతున్నారు అనిపిస్తున్నది…

అసమానతలు

స్త్రీ లు చేసే సేవలకు ఎంత గుర్తింపు వుందన్న విషయము ప్రక్కన పెడితే, జాతీయGDP లో కూడా వీరి సేవలు లెక్కకు రావనుకుంటాను.  ఒక వ్యక్తి అది పురుషుడు కావొచ్చు, స్త్రీ కావచ్చు సజావుగా ఉద్యోగం, జీవనము జరపాలంటే కూడా వుండి చూసుకునే వారుండాలి. భాగస్వాములిద్దరూ వుద్యోగములో వుంటే వారికి పూర్తి సమయము వెచ్చించే ఒక సహయకుల అవసరము ఎంతైనా వుంటుంది. అప్పుడు ఆ సర్వీసులను జాతీయ ఆదాయాల లెక్కలలో జమచెయ్యటం కుదురుతుంది.  కానీ ఇలా లెక్కకు…

vangibadh –

“తప్పుచెయ్యటం నేరం కాదు, కారణం తెలుసుకోకపోవటం మహా ఘోరం ” అన్నాడు శ్రీ. శ్రీ. యండమూరి కూడా ‘తప్పుచేద్దాము రండి’ అని పిలిచారు మీకు గుర్తుందో లేదో… అసలు ఒక్కసారైనా ఫెయిల్ కాకపోతే వారిని అన్ని తెలిసిన వారిగా పరిగణించరు కొందరు. కొన్ని ఉద్యోగాలలో అయితే ఒక్కసారి కూడా ఫెయిల్ అయిన అనుభవము తెలియక పొతే, రిస్క్ మ్యానేజ్మెంటు ఎలా చేస్తారని వారిని దూరం పెట్టటం కూడా కద్దు. ‘ఒకటి రెండు చెడితే కానీ వైద్యుడు కాడని’…