విలంబకి స్వాగతం చలి ఇకనన్నా తగ్గమని ప్రకృతిని వేడుదాం చైత్రానికి గుర్తుగా వికసించిన పుష్పాలు నగరానికి అద్దాయి హరివిల్ల చందాలు స్వరరాగ మదురిమల ఉద్యానవనాలకు సన్నద్దమవుతున్న వీది వాకిలులు ఎగిరాయి పక్షులు, మురిసాయి వృక్షాలు… మనందరము మనుష్యులం దేవుని సృష్టికి గుర్తులం మన హృదయాలు పండాలని.. ప్రపంచము శాంతి దిశగా నడవాలని రేపటి మీద ఆశతో ముందుకడుగేదాం కలసి మెలసి నడుదాం వెలుగు ప్రగతిబాటగా మునుముందుకు నడుదాం వివంబను స్వాగతిద్దాం మీ సంధ్యా యల్లాప్రగడ
Category: కవిత్వం
నీ లోన వున్న నీవు
నీ లోన వున్న నీవు ———————— తిరిగిని, భువి యంత ప్రదక్షిణ చేసినా, దేశాలు ఎగిరినా, ఖండాలు దుమికినా పుణ్య క్షేత్రాలు తిరిగినా అణువణువు వెతికినా జల్లెడేసి గాలించినా స్తంభించి శోదించినా దొరకునా? అది నీకు దొరకునా? వెతికి వెసారాక కడకు మిగిలేది లేదుగా వెతరవలసినది లోన వెతికితే లోలోన, వెతికితే నీలోన, లోలోన…..వున్నదది అమ్మే ! అది నీవే…. నీ ఆత్మగా నుండి, నీ వెలగుగా వుండి నీ జీవితము పండి… నిలిపేది అమ్మగా… అంతర్ముఖ…
కవిత్వము:
మనసులో మాటలు,ప్రపంచ కవిత్వ పండుగ