వంటగదిలో ఆధునికత – ఎంత ఆరోగ్యము ?

పూర్వం, అంటే కట్టెల పోయి ఉన్నప్పుడు, బియ్యం నానబోసి రోట్లో దంచినప్పుడు, సర్వం కుంపటి మీదనో, మరో దాని మీదో వంట చేసే స్త్రీ లకు కిరసనాయిలు స్టవ్వు వచ్చినప్పుడు వంట త్వరగా అవుతున్న సంతోషమే తప్ప మరోటి కలిగి ఉండదు. కానీ అప్పటి రోజులలో కాఫీ, పాలు కిరోసిన్ స్టవ్వు మీద కానిచ్చి, ఆ స్టవ్వు తాలూకు వాసన గురించి కంప్లియెంట్ చేసేవారట.  కుంపట్లో కాచమని కూడా గొడవ వుండేదని చెబుతారు పెద్దవాళ్ళు వుంటే.  గ్యాస్…

ఆవకాయ తొక్కు పచ్చడి

ఆవకాయ అమ్మలాంటిది కదండీమనకు రోజు వారి జరిగిపోవాలంటే ఆవకాయ తప్పనిసరి ఉదయం పలహారమో లోకి మొదలు – మధ్యాహ్నం ఎంత షడషోపేతమైన పూర్తి స్థాయి  విందులోకి,సాయంత్రం ఏ పకోడీనో లేక బజ్జి లోకో , రాత్రి తేలికపాటి టిఫిను కానీ, భోజనం కానీ ఇది ఉండవలసినదే. ఆవకాయ సంవత్సరానికి ఒక్క సారి తయారు చేసుకుంటే చాలు ఇంకా చూసుకోనక్కర్లేదు. ఇండియా లో నైతే మా చిన్నపుడు అమ్మ పనివాళ్ళకు క రోజు అన్నం తోపాటు ఆవకాయ కూడా ఇచ్చేది….

ప్రపంచము మరచిన చక్రవర్తులు

అసలు చరిత్ర ఎందుకు తెలుసుకోవాలి?  అలా అని ఎవరైనా ప్రశ్నిస్తే దానికి సమాధానం: చెట్టు, వేరు లేకుండా పెరుగుతుందా? మనగలుగుతుందా?  నీ మూలాలు నీవు తెలుసుకోలేకపోతే నీవు భవిష్యత్తులో సాధించేదేమిటి?  తన చరిత్ర తనకు తెలియని వారు, సాధించే ఘనకార్యాలు ఏముంటాయి?   మన చరిత్రను తెలుసుకోవటమే కాదు, దానిని గురించి మనకు లభిస్తున్న ఆధారాలను జాగ్రత్త పెట్టుకోవలసిన అవసరము కూడా మనకుంది.  ఈమధ్యలో చుసిన ఒక చిన్న వీడియొ క్లిప్ చాలా చిరాకు పరిచింది.  కొందరు తుంటరులు…

సొగసైన బిళహరి 

సొగసైన బిళహరి  మొన్నటి వారము నా నేస్తం వచ్చింది నన్ను కలవటానికి. చక్కటి గాయని అయిన తను నన్ను, నా సంగీత సాధన గురించి అడిగినప్పుడు, అదిగో అప్పుడు అందుకున్నాను నా విపంచిని.  సరే కానీయి, అంటూ ఆలపించింది బిళహరి లో. నాకు సాధన లేక కుంటూ పడుతూ, గాత్రంలో మాత్రం సాగించాను తన కూడా. మరి బిళహరి కున్న  బలమే అది. మంచి కోమలమైన రసభరితమైన రాగం. ఉదయమైనా, సాయంకాలంలోనైనా హాయిని పంచే సరస కోమల…

వసంత పంచమి

“యా కుందేందు తుషార హారధవళా యా శుభ్ర వస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభి ర్దేవైస్సదాపూజితా సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా’ మాఘ శుద్ధ పంచమి న వసంత పంచమి జరుపబడును. దీనిని శ్రీ పంచమి అని కూడా అంటారు. దీనిని సరస్వతీ జయంతి, మదన పంచమి అని కూడా అంటారు . సరస్వతీ దేవిని ఆరాధించే దినమే వసంత పంచమి. సరస్వతీదేవి నాలుగు చేతులతో అలరారుతుంటుంది. తెల్లని వస్త్రంతో,…

పార్టిలు చేసుకోవటానికి కిటుకులు

చిన్న పార్టీ లకు కావలసిన ఏర్పాట్లు  మనం మన ఇంట్లో పార్టీ అంటే హడావిడి పడటం సాధారణం. మన అతిధులు గుర్తుంచు కునేలా పార్టీని నిర్వహించాలని కోరుకోవటంలో తప్పులేదు. పైపెచ్చు అది మన కనీస బాధ్యత. దానికి ఏర్పాట్లు చేసుకోవటం, మనం కూడా ఆ పార్టీలో మిత్రుల సమక్షంలో సంతోషం పొందటం మన హక్కు కూడా. కొన్ని చిన్న చిన్న ఏర్పాట్లు ముందుగా చేసుకుంటే ఎలాంటి పార్టీ అయినా ఇబ్బందులు లేకుండా సజావుగా సాగిపోతుంది.  ముందుగా పార్టీ…

పూర్వపు కథలను కనుల ముందు నిలిపే ‘ప్రాచీన గాథాలహరి’

పూర్వపు కథలను కనుల ముందు నిలిపే ‘ప్రాచీన గాథాలహరి’ కొందరు రాసినవి ఎంత చదివినా అర్థం కావు. అది భాష కావచ్చు, అందులో చెప్పే విషయం కావచ్చు. కొంతమంది రచనలు వలిచిన అరటిపండులా మృదువుగా ఉండి, చకచకా చదింవించేస్తాయి. కొందరి రచనలు గ్రాంధికంగా ఉన్నా కూడా కధనం, రచనా శైలి లో పట్టుతో, సస్పెన్సును చివరి వరకు నడిపించిన విధానముతో ఒక పట్టున చదివిస్తాయి. అలాంటి రచనలలో, అంటే గ్రాంధికంగా ఉన్నా, చదివించే రచనలు చెయ్యటంలో శ్రీ….

Gift idea for men

ఎవరికైనా బహుమతి ఎవ్వరైనా ఏ కొలమానము బట్టి ఇస్తారు? వారు పిల్లలా? పెద్దలా? వారికి ఇష్టాలు ఏమిటి? అఇష్టమేమిటి! అని కదా చూసి ఇస్తారు. అదే పరిచయస్తులకు అయితే గిఫ్ట్ కార్డు ఇస్తారు. అది తీసుకున్నవారి అభిరుచి బట్టి వాడుకోవచ్చు. మాములుగా మన ఇంటికి ఎవరైనా వస్తే చీరలు, రవికలు పెడతాము. లేదా పండు చేతిలో పెడతాము. అదే అబ్బాయిలే వస్తే? వారికి చేతిలో ఎం పెడతాము? పుట్టినరోజులు, కొన్ని ప్రత్యేకమైన రోజులకు పురుషులకు గిఫ్ట్ గా…

అసమానతలు

స్త్రీ లు చేసే సేవలకు ఎంత గుర్తింపు వుందన్న విషయము ప్రక్కన పెడితే, జాతీయGDP లో కూడా వీరి సేవలు లెక్కకు రావనుకుంటాను.  ఒక వ్యక్తి అది పురుషుడు కావొచ్చు, స్త్రీ కావచ్చు సజావుగా ఉద్యోగం, జీవనము జరపాలంటే కూడా వుండి చూసుకునే వారుండాలి. భాగస్వాములిద్దరూ వుద్యోగములో వుంటే వారికి పూర్తి సమయము వెచ్చించే ఒక సహయకుల అవసరము ఎంతైనా వుంటుంది. అప్పుడు ఆ సర్వీసులను జాతీయ ఆదాయాల లెక్కలలో జమచెయ్యటం కుదురుతుంది.  కానీ ఇలా లెక్కకు…

side table with books

It’s always fun to do a few home improvement projects. They will make you feel proud of yourself and also your creativity will enhance. I enjoy doing such projects. In my home, my library is a good place to hang around. I wanted to add a small side table to put the floor lamp already…