ఆవకాయ అమ్మలాంటిది కదండీమనకు రోజు వారి జరిగిపోవాలంటే ఆవకాయ తప్పనిసరి
ఉదయం పలహారమో లోకి మొదలు – మధ్యాహ్నం ఎంత షడషోపేతమైన పూర్తి స్థాయి విందులోకి,సాయంత్రం ఏ పకోడీనో లేక బజ్జి లోకో , రాత్రి తేలికపాటి టిఫిను కానీ, భోజనం కానీ ఇది ఉండవలసినదే.
ఆవకాయ సంవత్సరానికి ఒక్క సారి తయారు చేసుకుంటే చాలు ఇంకా చూసుకోనక్కర్లేదు. ఇండియా లో నైతే మా చిన్నపుడు అమ్మ పనివాళ్ళకు క రోజు అన్నం తోపాటు ఆవకాయ కూడా ఇచ్చేది. అందుకే వాళ్ళు చాలా ఎక్కువే పెట్టేవారు ఒకే సారి.
నా మిత్రులు ఎవరైనా వచ్చినా మా ఇంటి అవకాయని అడిగి మరీ వేసుకొని తిని రుచి చూసి వెళ్లేవారు. అంత పేరు ఉండేంది మా ఇంట్లో ఆవకాయ.
ఆవకాయ అనాదినుంచి వస్తున్నది.
మన జీవితాలు దానితో ముడివేసుకుపోయాయి. నేను ఇండియా వదిలి వచ్చెసేటప్పుడు ఏది ఉన్నా, లేకున్నా ఆవకాయ లేకుండా రాలేదు ఇంతవరకు.అంతటి ఘనమైనది కదా ఆవకాయంటే।
మా చిన్నప్పుడు మేము ఊరువెళ్లి వచ్చాక హోటలు నుంచి భోజనము తెప్పించము అదీ వుండేది కాదు. ఇంత అన్నం ఉడకేసుకొని ఆవకాయ పెరుగు తో కానిచ్చే వాళ్ళము అలవాటుగా. ఇప్పుడు స్నిగ్గిలు వచ్చాయనుకోండి!!
మనకు ఆవకాయ ఓక అక్షయపాత్ర, ఓక చలివేడ్రం లాంటిది రుచికి.
అది చేయ్యటం, నిలవ జాడిలలో వుంచటం అదొక విద్య. సైన్స్ లాంటిది. వేసవిలో అమ్మా, నాన్నమ్మ మడితో ఆవకాయ పెట్టడము ఒక వ్రతములా చేసేవారు. ఈ ఆవకాయ కాయలు ఇంట్లోనే తరిగేవారు మా నాన్న. దానిక ప్రత్యేకమైన కత్తిపీట వుండేది. కేవలం ఈ ఆవకాయ పనికే అది వాడేవారు. చాలా పడునుగ వుండేదట మరి టెంకలు కూడా తరగాలిగా. అలా అంతా కలసి ఒక పెద్ద జాడి మడి ఆవకాయ, ఒక పెద్దది జాడి మామూలు ఆవకాయ నిలువగా పెట్టేవారు. అది ఏడాది మొత్తం వచ్చేది.
ఇప్పుడు మా ఇంట్లో ఆవకాయ నిండుకుంది.సమ్మర్ రాకుండానే.
నా కాలు చేయ్యి అడటంలేదంటే నమ్మండి ఇంక. అక్కయ్య ఎదో పంపినది కానీ అది ఇంకా అందలేదు.
ఇంక అపధర్మంగా అవకాయ తోక్క చేశాను. బాగా కుదిరిందని మావారు సర్టిఫికెట్ ఇచ్చారు. అంటే tested and ప్రూవ్డ్ అన్నమాట .అందుకే ధైర్యం చేసి మీతో పంచుకుంటున్నాను.
ఈ తొక్కు కు కావలసినవి :
మామిడికాయలు మీ ఇష్టం. కానీ ముందుగా 1 కాయతో చేసి చూడండి. కొలతలు 1 కాయకే ఇక్కడ చెబుతున్నాను.
నూనే 1 కప్పు
3 చెంచాల కారము
2 చెంచాల ఆవపిండి
2 చెంచాస మెంతి పిండి
ఇంగువ ఉప్పు, తిరగమాతలో వాడెందుకు ఎండుమిర్చి 2,కొద్దిగా ఆవాలు.
విధానము:
ముందుగా ఒక కాయ మామిడి తీసుకొని కావలసిన సైజు లో తరిగి గిన్నెలో వేసి మునిగేలా నీరు పోసి ఉడకపెట్టాలి.
ఉడుకుతున్నపుడు 3 చెంచాల కారం
ఒక చెంచా ఉప్పు కొంచం పసుపు ,
చేరో 2 చెంచాలా అవ మరియు మెంతి పిండి వెయ్యాలి.
ఒక బండిలో నూనె కాచి అందులో కొద్దిగా ఇంగువ, ఆవాలు, ఎండు మిరప వేసి వేయించి ఇందులో కలపటం .
అవ తొక్క తయారు.
రుచికి రుచి అవకాయ అందే వరకు సహయకారి.
ఇలాంటివి నిలువ ఒక పది రోజులకు మించి వుండవు. కాబట్టి చిన్న మొత్తముగా చేసుకోవటమే ఉత్తమము.
ఆవ పిండి మనము అప్పటికప్పుడు చేసుకుంటాము కాబట్టి మంచి ఘాటుగా కూడా వుండి రుచిగా వుంటుంది. ఇలాంటివి ఆధరువులకు అధనపు రుచి.
ఇవి ఏ పార్టిల కోసమో చేసికుంటే ఆ పార్టి సూపరు హిట్ ఇదే అవుతుంది. దానికి కారణం అందులో వుండే తాజాతనము.
మీరు నూనే ఆవ నూనే వాడితే ఆ ఘాటుకు అటు నుంచి ఇటుగా అంతా దాసోహమంటారు.