హల్వా

హిట్టా…ఫట్టా… నవరాత్రులు ముగిసిన ఇన్ని రోజులకు నా నవరాత్రులలో విశేషాలు పంచుకోవాలని అనిపించింది.  నా యోగా క్యాంపు మూలముగా నేను నవరాత్రులలో ఆరాధన షష్ఠి, సప్తమి వరకూ మొదలెట్టలేకపోయా. అందుకే రోజూ ఒక తీపి, ఒక అన్న ప్రసాదము మాత్రమే చెయ్యగలిగాను. లేదంటే రోజూ ఆ వ్రతములో చెప్పిన నైవేద్యము వండుతాను సాధారణముగా.  తీపి ఎప్పుడూ అన్నపరమాన్నమే. అదేమంటే – అమ్మవారు ‘పాయసన్నప్రియే’ కదా! అని సమర్ధన.  నిజానికి నాకు బాగా చెయ్యటము వచ్చినందు వలననో, ఎప్పుడూ…

katte pongali

మరో రోజు ప్రారంభం, తప్పదు మనకు వంటింటి తో సహవాసం. ఇంత పెద్ద వంటగది పెట్టుకున్నది మరి అందుకే జంజాటము… వంటింట్లో ఉండటం తప్పదు, అటు – ఇటు గిరగిరా తిరగలిలా తిరగటమూ తప్పదూ. గడబిడి లేకుండా ఆ మూల నుంచి ఈ మూలకూ తిరిగితే కొంత వర్కౌట్, సందులో సడేమియాలా కాస్త కమ్మనివి వండవచ్చు! ఫ్రైడే (శుక్రవారము) వచ్చింది. థాంక్స్ గాడ్ ఇత్స్ ఫ్రైడే(ThankGod Its Friday) అనటానికి లేదు. ఈ రోజు మరింత పని,…

Akakarakai pulusu

తెల్లారింది మొదలు మానవులకు తిండిగోల తప్ప మరోటుండదా అని దిగులేస్తుంది ఒక్కోసారి. ఈ ఉదయము శ్రీవారు నాతో “టిఫెను పెట్టు ఆఫీసుకెళ్ళోస్తా’ అన్నాడు. ఈ చద్దిపెట్టె( ఇలా అనమని మిత్రులు సలహలిచ్చారుగా) లో భద్రంగా వున్నాయి పూరీ కూరా తినెయ్యరాదూ’ అని అర్థించాను. “ఏ యూగాలనాటివి అవి” “త్రేతాయగమనుకుంటా’ “అయితే ఆర్కేయాలజీ వారికి పంపు… నాకు మాత్రం ఎదైనా టిఫిను పెట్టు’ అన్నాడు షార్పుగా. ఈ ఉదయమే ఓ ఉప్మా కథ చదివారు. అది గుర్తుతెచ్చుకుంటూ ‘ఆఫీసుకు…

tomato chutney

ఈ రోజు శీతన వస్తు సముదాయ భద్రతా భరిణ (ఫ్రిజ్‌)లో చూస్తే చెర్రీ టమోటో లు చాలా వుండిపోయాయి. వాటిని సలాడు లో వాడుదామని తెచ్చాను. నేను రాత్రి పగలు తిన్నా మిగిలిపోయి పాడయిపోతాయని దిగులేసి ఫాస్టుట్రాకు లో వాడటానికి ఏకైక మార్గంగా పచ్చడి లాంటి ఊరగాయ ఒకటి చేశాను. ఈ రెసిపీ నాకు హైద్రాబాదులో మా వంటమనిషిగారు చెప్పారు. ఆమె అలా చెకచెక చాలానే చెప్పేవారు. అందుకున్నవారికి అందినంత. నాకు తోచినన్ని రాసుకున్నాను. అలా ఈ…

ఆవకాయ ప్రహసనము

ఎవ్వరిని పలకరించినా ఊరగాయ కథలు ఊరించి, ఊరించి చెబుతున్నారు. అందరి గోడలకు రంగులు మారి ‘త్రి మ్యాంగో’ కారం తో ఘాటుగా నిండిపోయింది. మహామహా వంటగాళ్ళ, మామూలు వంటగాళ్ళు, వాసన తెలిసిన వంటగాళ్ళు, బద్దకపు వంటగాళ్ళు అని నాలుగు విభాగాలు చెయ్యాలి అసలు అందరిని. అందులో అట్టడుగున ఉన్న చివరి రకంకి చెందిన నేను, అంటే – వంటే రాదు కానీ, బద్దకమని ముసుగులో పరువు కాపాడుకునే బాపత్తన్నమాట. నాలాంటి వాళ్ళకి రోజూ వంటే ఎవరెస్టు ఎక్కటం,…

కమ్మని కాకర పులుసుకూర

కాకరకాయ అంటే కేవున కేక వేసి కనపడకుండా మయామయ్యేవారము మా చిన్నప్పుడు. నేను చిన్నతనములో కాకరంటే కళ్ళు తేలేసి, కొంకర్లుపోయి, తినకుండా కనుమరుగయ్యేదాని. అమ్మ సన్నగా తరిగి కమ్మగా, దోరగా వేయ్యించి పంచదార చల్లినా వద్దంటే వద్దని గొడవ చెయ్యటము మా జన్మహక్కుగా వుండేది కుర్రతనమున. కాని ఒకసారి ఇది తిన్నాను. నా కాలేజిలో నేస్తాలు పెట్టారు. పేరు తెలియని కూర కమ్‌ పులుసను, తిన్నాను కడుపార,తరువాత కనుకున్నాను కాకరిదని, ఇంత కమ్మగా చెయ్యవచ్చని.  ఇది కాకర…

మన వంటగది ఒక ప్రయోగశాల:

మన వంటగది ఒక ప్రయోగశాల: ఇది నిజం కూడాను! చాలా సార్లు నిరూపించబడినది కూడా!! నిన్నటి ఉదయం శ్రీవారు వంటగదిలోకి వచ్చి “ఏంటి వండుతున్నావు ఈ రోజు?” అని అడిగారు. ఆయన కళ్ళలో భయం నాకు స్పష్టంగా కనిపించింది. నా వంటంటే భయం కాదు అది. నా వంటకు భయపడటం మానేసి చాలా కాలమే అయ్యిందిగా! ఏదో సామెత చెప్పినట్లుగా, రోజూ చచ్చేవాడికి ఏడ్చేవాడు ఉండడని, నా వంటకు ఎంతకాలం భయపడుతాడు చెప్పండి పాపం మానవుడు! సరే…

చలిపొద్దు సమోసా

మూడు రోజులుగా ముసురుగా ఉంది. అసలు వాన తగ్గడంలేదు.  మాకు వాన వచ్చిందంటే దడ దడగా పడటమే తప్ప ఇలా ముసురుగా ఉండదు. కురిసేది ఒక్కసారి కురిసి, వెళ్ళిపోతుంది.  కానీ ఈసారి మాత్రం మూడు రోజులైనా తగట్టం లేదు.  అసలు ఇక్కడ వారు అంతా వాన గురించి ఎక్కువగా ఎప్పుడు సియాటెల్ లోనే పడుతుందని అంటారు. కానీ మీరు రికార్డ్స్ కనుక పరిశీలిస్తే ఎక్కువ వాన పడేది మా అట్లాంటాలోనే.  వాన పడితే బాగుంటుంది అంతేకాదు పనులకు…

క్యాప్సికమ్ రైసు

క్యాప్సికం రైస్ తో జీవిత పాఠాలు : కొన్ని సార్లు కొన్ని విషయాలు చిన్నవే కానీ, చాల పెద్ద పాఠాలు చెబుతాయి. నాకు వంట అంతగా ఇష్టమైన విషయం కాకపోయినా, వండటంలో, వడ్డించటంలో చాలా శ్రద్దగా ఉంటాను.  అంటే, ఒక జంధ్యాల సినిమాలో శ్రీలక్ష్మిలా ఎలాగైనా మంచి వంట చేసి భర్తను ఎలా సంతోష పెట్టాలని ప్రతిజ్ఞ చేస్తుంది చూడండి. అలాగా నేను కూడా నా పెళ్ళైన క్రొత్తలో ప్రతిజ్ఞ చేశాను.  అప్పుడు నా వంట నిజానికి…

డిన్నరు ఐడియాలో

మన మిత్రులు మన ఇంటికి  ముందుగా చెప్పకుండా రావటం అన్నది 10 సంవత్సరాలకు పూర్వం సర్వ సాధారణ విషయము. చుట్టాలు వచ్చే ముందు కొన్ని సార్లు ఉత్తరాలు రాస్తే వారు. మన పాత సినిమాలలో చూడండి, అప్పుడే లెటరు ఇచ్చి వెడతారు, మరు క్షణం కారులో స్టేషనుకు వెడతారు సూర్యకాంతం గారి కారు చోదకుడు.  మరి కొన్ని సార్లు అల్లుడు వచ్చి రుసరుస లాడుతాడు. వస్తున్నా మని లేఖ రాసినా కారు పంప లేదని. మరు క్షణం…