తెల్లారింది మొదలు మానవులకు తిండిగోల తప్ప మరోటుండదా అని దిగులేస్తుంది ఒక్కోసారి.
ఈ ఉదయము శ్రీవారు నాతో “టిఫెను పెట్టు ఆఫీసుకెళ్ళోస్తా’ అన్నాడు.
ఈ చద్దిపెట్టె( ఇలా అనమని మిత్రులు సలహలిచ్చారుగా) లో భద్రంగా వున్నాయి పూరీ కూరా తినెయ్యరాదూ’ అని అర్థించాను.
“ఏ యూగాలనాటివి అవి”
“త్రేతాయగమనుకుంటా’
“అయితే ఆర్కేయాలజీ వారికి పంపు… నాకు మాత్రం ఎదైనా టిఫిను పెట్టు’ అన్నాడు షార్పుగా.
ఈ ఉదయమే ఓ ఉప్మా కథ చదివారు. అది గుర్తుతెచ్చుకుంటూ
‘ఆఫీసుకు వెళ్ళాక నేను తిన్న పదార్థాల- యుగాల గురించి ఫోస్టాలి’ అంటూ జోకు కూడా జోడిస్తూ.
దానికి తోడుగా ‘చుట్టాలుంటే తెగ ఆవేసి వండి, వాళ్ళు అటు వెళ్ళగానే నాకు యుగాల నాటి ఫుడ్డా’ అంటూ నిందొకటి.
చవితి చండ్రుణ్ణి చూడకపోయినా నిందలు తప్పటములేదు.
‘నిన్ననేగా టమొటో పచ్చడి చేశాను. కూర పచ్చడి చప్పరించి ఇలా నీలాపనిందలు వెయ్యటం బాలేద’న్న నా గగ్గోలు గాలో గాయబ్‌అయ్యింది.
టిఫిన్లు వండి , ఈనాటి వంటగా
బొంత కాకరకాయ ఊరఫ్ ఆకాకరకాయ లతో పులుసుకూర వండి సాక్ష్యానికి ఇక్కడ ఫోస్టుతున్నా. ఈ మధ్య నాకు శత్రువు లెక్కువయ్యారు.
అందుకే వండి పెడుతున్నా అన్న సాక్ష్యానికన్నమట ఈ గోలంతా.
ఇది చేస్తానలే వెళ్ళిరండి మహానుభావా అంటే శ్రీవారు ‘ నీ పసుపుకుంకుమ చల్లగా తినిపెడతా గాని కమ్మగా బెల్లం గట్రా వేసి చేసి పెట్టమ్మా’ అంటూ సాగతీసి ఆఫీసుకేగాడు.
****
అందుకే ఇలా వండానండి.
ఇక్కడ శీతలీకరించినవి(frozen)వి దొరుకుతాయి. మా చిన్నప్పుడు చక్కగా అప్పుడే కోసినవి – కోటిలో అమ్మేవారు పల్లెపడుచులు. అక్కయ్య కాలేజీ నుంచి వస్తూ పట్టుకొచ్చేది. లేతగా వుండి చేదు తక్కువగా వుండేవి. వాటిని బెల్లం లో ఉడకేసి అమ్మ చేసేది.
ఈ ప్రోజెను కాకర నీళ్ళలో వేసి ఉడకపెట్టి అందులో చింతపండు రసము, బెల్లం, ఉప్పు, కారం, పసుపు చిటికెడు, కొద్దిగా ధనియాల పోడి వేసి వుడకనిచ్చాను. దగ్గరకు వచ్చాక ఇంగువ తిరగమోత కలిపి కొద్దిగా శనగపిండి చల్లి దించాను. ఇది ఈ నాటి వంటకము. వెరసి రోజూ వండుతున్నానని సాక్ష్యం…
మరి నామజపమో అనుకోకండి…
అరుణాచలములో ఉదయము రమణుని వద్ద ఒక తమిళ స్రోత్తం పాడుతారు. తెలుగులో రచించి అదే ట్యూనులో యూట్యూబులో వుంది. ఉదయాలు అది వింటూ ఈ వంటా వార్పు, కాఫీ టిఫిన్లు, అంట్లూ, తంటా అన్నీ కూడా రమణుడికే సేవగా చేసేయ్యటం ఎదో…ఇలా…. సాగుతోంది..
ఆ ట్యూను కుదిరితే వినండి. ఇండియాలో మీకు ఇన్ని ఇకట్లు వుండవు. ఎంచక్కా ఎప్పుడూ అమ్మవారి జపంతో గడపొచ్చు.
ఽఽస్వస్తిఽఽ