పులిహోర

గుడిలో పులిహోరలా మనము చేసే పులిహోర వుండాలంటే? వైష్ణవ దేవాలయాలు ప్రసాదానికి ప్రసిద్ధి. అందునా పులిహోర. మనము మన పండుగలకు ఎన్ని చేసినా పులిహోర లేకపోతే పండగే కాదు. దక్షిణ భారత దేశపు వంటకాలలో ఎంతో ప్రముఖమైనది, పవిత్రమైనది పులిహోర. పులిహోరలు ఎన్నో రకాలు చెయ్యవచ్చు. చింతపండు, నిమ్మకాయ, దబ్బకాయ,మామిడి కాయ పులిహోర ఇత్యాదిని. గుడిలో చాలా మటుకు చింతపండు పులిహోర ప్రసాదంగా ఇస్తారు. అది రుచిలో కొద్దిగా తేడాగా మనము ఇంట్లో వండే పులిహారలా వుండదు….

vangibadh –

“తప్పుచెయ్యటం నేరం కాదు, కారణం తెలుసుకోకపోవటం మహా ఘోరం ” అన్నాడు శ్రీ. శ్రీ. యండమూరి కూడా ‘తప్పుచేద్దాము రండి’ అని పిలిచారు మీకు గుర్తుందో లేదో… అసలు ఒక్కసారైనా ఫెయిల్ కాకపోతే వారిని అన్ని తెలిసిన వారిగా పరిగణించరు కొందరు. కొన్ని ఉద్యోగాలలో అయితే ఒక్కసారి కూడా ఫెయిల్ అయిన అనుభవము తెలియక పొతే, రిస్క్ మ్యానేజ్మెంటు ఎలా చేస్తారని వారిని దూరం పెట్టటం కూడా కద్దు. ‘ఒకటి రెండు చెడితే కానీ వైద్యుడు కాడని’…

వంకాయ పోయి సాబుదాన్‌ వచ్చే డాం డాం డాం😀😀 —————

ఆలోచిస్తూ కుర్చున్నాను. గుత్తి వంకాయ కూర చెద్దామా? బెండ కాయ పులుసా? తేల్చుకోలేకపోతున్నా…. నాకు రెండూ వచ్చు. వచ్చు అంటే అలా ఇలా కాదు…స్వర్గానికి వెడుతున్నా నే వండిన వంకాయ కూర … అటు ప్రక్క వుంటే, వెళ్ళటము ఆపి బైటాయిం చేస్తారు దేవతలైనా మరి. వీసా రాని మా పిన్నిగారి కొడుకు నే చేసిన ఈ కూర తిని కొంత తీసుకుపోయి వాళ్ళకిచ్చి వీసా చటుక్కున పొందాడు. అంత ఘనమైన కూర నే చేసే గుత్తి…

పప్పుతో. తిప్పలు

మనకు చిన్నప్పుడు వేరు వేరు కారణాల వలన వంటగది ప్రవేశం నిషేధమయితే తరువాత చాలా ఇబ్బంది పడతాము. అందుకే మన పిల్లలకు చిన్నప్పుడే వంట కాకపోయినా, కనీసము వంట సరుకులన్నా పరిచయము చెయ్యాలి. ఈ వంట సరుకుల పరిచయము లేక గందరగోళపు, తిక్క శంకరయ్యలాంటి వంటలు చేసి పరులకు హాని చేసే అవకాశాలు బహు మెండుగా వుండటము సామాన్యమే కదా మరి!!.  నావరకూ నాకు, చిన్నప్పటి నుంచి వంటగది ఆక్సిడెంట్లు ఎక్కువ. అసలే మనము కస్టర్డ్ పొడితో…

బాంబులా జామునుల్లా

వంటగది ఒక ప్రయోగశాల వంటిదంటారు పెద్దవాళ్ళు. అందులో ప్రయోగాలు ఫలించాయా అద్భుతమైన ఆహారము. వికటించాయా మన ప్రయోగశాలలో గాజు గొట్టాలు పగిలి మంటలు ఎగబాకినట్లుగా ఇక్కడ ప్రమాదాలు జరుగుతాయి.ఆ వంటలు వికటించాయా మన మొహాలు నిర్మాతో తోమటము ఖాయం! అందుకే తస్మాత్ జాగ్రత్త అవసరము. ఉదాహరణకే చూడండి, గమ్మున వుండలేక గుబులేసి… గులాబు జాములు తిందామంటే నా గూబ పగిలింది. కన్ను లొట్ట పోయి అమ్మ చేతిలో సూపరు రిన్ తళతళలతో మెరిసిన నా ఈ ప్రహసనం….

Avakai

ప్రతి వేసవిలో పెద్ద ముతైదువలా ప్రతి తెలుగువారు గడపను పావనము చేసి వారి ఆలనా పాలనలో ప్రధమ సహయాకారి, అందరి ప్రియతమ అవకాయ ను అందరు స్వాగతించ సన్నాహాలు జరుపుతున్నారుగా. బాగు!బాగు! మేము మీ అంత పకడ్బందీగా కాకపోయినా కొద్దిగ ముక్కల పచ్చడి, మెంతిబద్దలు గట్రా చేసి ఆనందిస్తున్నామన్నమాట. ముందు ఘనస్వాగతము పలికాను, షాపులో మామిడికాయలు కనపడగానే… గౌరవముగా తీసుకొచ్చి ఇంటికి రాగానే.. శుద్దోదక సాన్నం సమర్పయామి యని, శుభ్రముగా కడిగాను. వస్త్రం సమర్పయాని, తుడిచాను మెత్తని…

అభినవ అక్షయపాత్ర – సమాన హక్కు

అమ్మా, నాన్నగారు మమ్ములను అందరిని తేడా లేకుండా ముద్దు చేసేవారు.. కానీ మా నాయనమ్మ మాత్రం తమ్ముడిని ఎక్కువ ముద్దు చేసేది.  ఒక్క విషయములో ఇంట్లో రామ-రావణ యుద్దము నడిచేది, నానమ్మకు నాకు మధ్య. ఆ విషయము ఏంటంటే….. ముద్దపప్పు. అవునండి. పప్పే. ముద్దపప్పు. ఉట్టి పప్పు అని కూడా అంటారు. అది ఎలాగంటే …  ఇంట్లో ఏ నెలకో ఒక్కసారి మాత్రమే ముద్దపప్పు, పులుసు కాంబినేషన్ చేసేవారు, మిగితా రోజులలో ఆకుకూర పప్పు వండేవారు. పిల్లలకి…

నాయనమ్మ మడి – తిప్పలు

మా పుట్టింట్లో చాలా మడి.. దడినూ … అందుకే మేము అసలు వంటింటి ఛాయలకు కూడా వెళ్ళేవాళ్ళము కాము మా చిన్నప్పుడు. ఏమి ముట్టుకుంటే ఎమి అక్షింతలేస్తారోనని భయం… అందునా మా నాయనమ్మ వున్నప్పుడు మరీనూ ఈ గొడవ ఇంకా కొంచం ఎక్కువయ్యేది. ఆవిడ మా ఇంట్లోనే ఉండేది,చాలా మటుకు,  బాబాయిలు దగ్గర అప్పుడప్పుడు ఉండి వచ్చేది. ఆవిడ వూరు వెళ్లిందంటే మాకు అందునా నాకు చాలా హ్యాపీగా ఉండేది. నాయనమ్మ వంట గది ఎప్పుడూ తుడుచుకోవటం,…

దిబ్బరొట్ట దోశగా మారిన వైనం- కృషితో నాస్తి దుర్భిక్షం:

దిబ్బరొట్ట దోశగా మారిన వైనం- కృషితో నాస్తి దుర్భిక్షం: మా ఇంట్లో దోశ పల్చగానూ, చక్కటి రుచితో రావటానికి ఒక దశాబ్ద కాలమే పట్టింది. ఆ కాలంలో నేను పడిన తిప్పలు, అగచాట్లు అంత ఇంతా కావు. రాస్తే ఒక నవలైపోవునేమో. సినిమా తీస్తే జంధ్యాల వారి చిత్రంలా నవ్వుల హిట్ అయిఉండేది. ఓంప్రథమములో అంటే పెళ్ళికి ముందు ఇంట్లో దోశలు అమ్మ వాళ్ళు వేస్తె తినటమే అలవాటు. పెళ్లి తర్వాత మొదటి నెలలో అత్తగారు వాళ్ళు…

గరిటెలు – తెల్లజెండా

ఈ రోజు మా శ్రీవారి జన్మదినం. అందుకే నాల్గింటికివచ్చారు భోజనానికి. వచ్చారుగా అని సంతోషంతో వడ్డించాను చేసిన అన్ని ఫలహారాలు. ఈయన పుట్టినరోజంటే మా పెళ్ళైన కొత్తలో విషయాలు గుర్తుకువస్తాయి నాకు. మా పెళ్ళైన రెండు నెలలకే తన జన్మదినం వచ్చింది. అప్పుడు మేము హైదరాబాద్ లోనే ఉండేవాళ్ళం. అత్తగారు వాళ్ళు మాతోనే ఉండేవారు. ఆ ఉదయం, “నూనె అంటమ్మా అబ్బాయి తలకు” అని మావగారు ఆజ్ఞ. నాకు ఇంకా ఇంత ట్రెడిషల్ వేషాలు లేవు. అంతా…