ఆడపిల్లలను బ్రతకనియ్యటం
లేదంటే, వాళ్ళను హింసించి
చంపుతున్నారురా దేవుడా, అంటే ముస్లీమా? హిందువా? అంటారు,
అక్కడ ఒక ప్రాణమురా…….
అది సరిగ్గా చూడండి!
ఒక ఆడ పిల్లని ఆడపిల్లగా చూడండి!
హిందువా, ముస్లిమా అని కాదు….
బలవంతులు బలహీనులను-
చెరుస్తున్న దుర్ముహుర్తమిది।
చెదపట్టిన న్యాయాలు,
కులమతాల రొచ్చులలో
స్త్రీ జాతికి వుచ్చులు తొడిగి
పాత బంధాల మీద
క్రొంగొత్త ఆంక్షలు తొడిగి
అంగట్లో అమ్మేస్తుంటే…
ఎక్కడుంది ప్రాణం విలువ?
ఎక్కడుంది మానము విలువ?
కలియుగమున ధర్మం
నాల్గవ పాదము
పుట్టుకున విరిగినదెమో-
ప్రళయానికిది నాందిగ మారి
కాళికలుగ ప్రతిమగువా
కరాళ కాల కదన నృత్యపు
నరమాలలు ధరించ వలెను।
తనలోన లోలొన దాగున్న
దుర్గమ్మను నిదురలేపి
పదనుపెట్టి కత్తులతో
మద మోహాందుల
కుత్తుకలను తెగనరకె
సమయమిదే।
మగువ తనలోని
లోలొని శక్తిని నిద్రలెప వలసిన తరణమిది.
ప్రతి స్త్రీ తనలోని శక్తిని
తెలుసుకోవాల్సిన యుగమిదే!
అత్యవసర సమయమిదే!
– సంధ్యా యల్లాప్రగడ