పలుకుల తల్లి

పలుకు పలుకుల తల్లి

పలుకు బంగారు తల్లి

పలుకుల పరా తల్లి

పలుకు ధాతువు వా తల్లి

పలుకు మూలమైన తల్లి

పలుకుల పగడపు తల్లి

పలుకు పశ్యతి అనాహతమున మా తల్లి

పలుకుపూబోణి

పలుకు జిలుకుల వైఖరి తల్లి

పలుకుటెలనాగ మా తల్లి

పలుకుగా మారు మా తల్లి

పలుకవదేమి ఓ తల్లి!!

తలచి పిలచితి తల్లి!!

నా ఆత్మనీవే తల్లి!!

పలుకులాడించ దీవించె మా తల్లి!!

సంధ్యా యల్లాప్రగడ

Leave a comment