ఆదివారం ఆట
క్రికెటు అంటే మనవాళ్ళు కళ్ళూ చెవులు అప్పచెప్పేస్తారు. అదీ అలా ఇలా కాదు. ప్రక్కగా అణుబాంబు వేసినా వారి కాలి మీద వెంట్రుక కదలదు వీళ్ళకి అంత శ్రద్ధ భక్తి వుంటుంది ఆట మీద.
మా శ్రీవారు అలా వళ్ళు మరచి, క్రికెటుకై ఆస్తి రాసిచ్చే సందర్భాలు కోకొల్లలు. ఎదో నేను ప్రక్కనుండి కాచుకోబట్టి బ్రతికి బట్టకడుతున్నాము ఇలా.
ఆయన ఆట చూస్తే మనవాళ్ళు గెలవరని నాకో గట్టి నమ్మకము. దానికి కారణాలున్నాయి. పూర్వం జరిగిన ప్రపంచ కప్పు ఆటలలో ఈయని చూసినప్పడల్లా వారు వోడారు. చూడకపోతే గెలిచారు.
ఆఫీసులో పని వల్లనో, మీటింగులలో ఇరుక్కున్నప్పుడో వారు గెలుపుకు ఎదురుండదు. అదే అలా ఇలాగు
ఈయన ఫోనులో మ్యూటు పెట్టుకు స్కోరు చూసుకుంటూ వుంటారు, అప్పడు మళ్ళీ ఫట్.
‘అలా చెయ్యట్టుకు వాళ్ళను ఓడించకు మహానుభావా’!అంటే వినడు గాక వినడు.
‘మేము ఫ్యాన్సు’ అంటూ ఆవేశపడతారు.
మాకు వున్న టీవి ప్యాకేజ్ లో క్రికెటు రాదు. కేవలము క్రికెటు కోసమని రెండు వేరువేరు చానల్సు సంవత్సరానికి పూర్తిగా కొని అందులో ఆటలు వచ్చే రోజులు సమయాలు తన కేలండరులో నోటు చేసుకుంటారు. మా టైంకు అర్ధ రాత్రికో అపరాత్రికో మొదలయ్యే ఆ క్రికెటును చూడటానికి రాత్రంతా మెలుకువగా వుంటాడు.
గదంతా చీకటిగా పెట్టి ఒక్కడే అలా లివింగు రూములో టీవి మ్యూటుగా పెట్టి చూస్తాడు. ఆనందమేమిటి అలా చూస్తే నాకర్థం కాదు.
ఎందుకంటే మేము కాలేజీలో వుండగా క్రికెటు తెగ ఫాలో అయ్యేవారము. మేము చూడటం మొదలెట్టామంటే కేకలు, గోల. ‘సిక్స్ అన్ని – అవుట్ అని. ‘కొట్టు ఆరు కొట్ట చార్’ అనీ కేకలు పెట్టి ఊదరగొట్టేవాళ్ళము. పీకెయ్యి వికెటు… ఆడండిరా సరిగ్గా అంటూ అరుపులు. చివరలు నైల్ బైటింగు అదే గోళ్ళు కోరికే చివరి వోవర్లలో ఆటకు మేము వేళ్ళు కూడా కొరికేసి, దేవుడికి కొబ్బరికాయలు మొక్కేసేవారము, మన వాళ్ళు గెలవాలని. కలలో ఆ ఆటగాళ్ళును దగ్గర్నుంచి చూసి తెగ సంతోషపడే వాళ్ళము.
ఆట చూస్తే అలా చూడాలి కాని చీకటిలో గూభ్యదెయ్యంలా దుప్పటి కప్పుకొని మ్యూటుగా టీవి పెట్టి చూడటమెందుకు? అందునా దగ్గరుండి మరీ వాళ్ళని ఓడించమెందుకు.
మొన్న మా ఇంట్లో ఇంటర్‌నెట్ తో సమస్య వచ్చింది. కామ్‌కాస్టు అతను మరురోజు వచ్చి చూస్తామన్నాడు. మేము ఫోను డేటా మీదున్నాము రోజంతా.
ఆరోజ మనోళ్ళు ఆసీస్ తో ఆట.
ఇక మా ఆయన చిందులు చూడాలి. చిన్న పిల్లలు చాకెట్లకై ఆత్రపడినట్లు ఫోను పట్టుకు అటు అటు కోతిలా గెంతులు. క్రిందికీ పైకి పరుగులు. మధ్యలో ఆఫీసు వాళ్ళతో అదే పోనులో మాట్లాడాల్సి వస్తే నా ఫోను అరువడగటం.
నేను చేప్పాను ‘బాబు దేవుడి దయ వలన మన ఇంటర్‌నెట్ చచ్చింది. వాళ్ళనొదలెయ్యి. ఆడుకుంటారు’ అని.
ఈయన ఆ గేము మిస్ అయ్యారు. వాళ్ళు గెలిచారు.
నే చెప్పానుగా ఈయన చూడకపోతే వాళ్ళు గెలుస్తారు. మాకు ఇంటర్‌నెట్ సరి చెయ్యగానే ముందుగా హైలైట్సు చూసి ‘మన నెటు వాకే’ అంటూ ఆనందపడ్డాడు.
ఈ రోజు ఆదివారము. పనుల లిస్టు చదువుతుంటే ‘నాతో మాట్లడవద్దని’ డిక్లేరు చేసి చెవులు కళ్ళు టీవికిచ్చేసాడు.
‘వద్దురా వాళ్ళని వదిలెయ్యి. ఎదో ఆడి సాదిద్దామనుకుంటున్నారు’ అంటే ‘మా రోహిత్ హిట్’ మా కోలీ హాటు, ఈ ఆసిస్ ఫట్’ అంటూ గోల…
నేను ఫైయింటు ఈ గోలకు.
మధ్యలో ఈయనకు కాఫీలు టిఫినులూ అందించి ఆదుకున్నా లేకపోతే రాత్రినుంచి చూస్తున్న కళ్ళు వూడిపోవు.
మన వాళ్ళు గెలిచారు మోత్తానికి. ఇక ఈయనే కప్పు తెచ్చుకున్నట్లు గొప్పలు.
ఆనందములో ఇలంతా అటు ఇటూ కొటాశ్రీనివాసరావు లెవల్లో తిరిగి, అవార్డులు గట్రా చూసి మళ్ళీ తిరుగుతుంటే
’ఇక ఆపు బాబు ఆ టీవి’ ఉదయమే దేవుడి నామము కూడా విననియ్యవు’ అంటే
‘హైలైటు ఎప్పుడు పెడతారా అని వైటింగు ఇక్కడ’ అంట.
‘ ఆట చూశావుగా మళ్ళీ హైలైట్సా’?!!’
‘ఆట చూసి తరువాత హైలైట్సు మళ్ళీ చూస్తే ఆ మజా యే వేరబ్బా’ అని ముక్తాయింపు,
మన క్రికెటు పిచ్చోళ్ళందరూ ఇలానే చేస్తారా? అని నా సందేహము.