గుసగుసలు ఘుమఘుమలు, గలగలలూ,-పదనిసలు,సరిగమలు -రుసరుసలు, కోరకొరలు మనకు తెలియకుండానే కొందరు చాలా ఆత్మీయులవుతారు. దానికి కారణము ముఖ్యంగా వారిలోని అవ్యాజమైన ప్రేమ, తోటి వారిపై వారికి వున్న నిర్మలమైన కరుణ. అందరిని తమ పిల్లలుగా ఆదరించే హృదయము. ఇవ్వన్నీ పుష్కలంగా వున్న గిరిజగారు నాకే కాదు తను పరిచయస్తులందరికి చాలా ప్రియమైనవారు, ఇష్టులు. ఆమె సియాటిల్ ట్రిప్పులో అట్లాంటా రమ్మని నే కోరిన కోరికను మన్నించి నాతో వారం రోజులు గడిపి వెళ్ళారు. ఆవిడ ఎక్కడుంటే అక్కడ…
Author: ఉహలు- ఊసులు - సంధ్య
కృష్ణం వందే జగద్గురుం
వందే కృష్ణం జగద్గురుం కౌరవ పాండవుల మధ్య యుద్దారంభములో, అర్జునునికి ఉపదేశించిన సారము, చిలిపి కృష్ణుడు ప్రపంచానికి మొత్తము గురువుగా మారి అందించిన బోధ, ప్రతి వ్యక్తి కుల మత బేధం లేకుండా చదివి బాగు పడగల గ్రంధరాజ్యం, మేనేజుమెంటు కైనా, వ్యక్తిత్వవికాసానికైనా అత్యుత్తమమైన ప్రామాణిక గ్రంధం, జీవితాని తీర్చిదిద్దుకోవాలంటే సాధనం, సాధకులకు ప్రస్థాన త్రయములో ఒకటి, సర్వ ఉపనిషత్‌సారముగా కొలవపడి, ప్రతి హైందవుల చేతులలో వుండవలసినది గ్రంధం “భగవత్‌గీత”. గీత గా పిలిచే ఈ 700…
nenu – stanford
ప్రపంచ విజ్ణానాన్ని పెంచే విశ్వవిద్యాలయాలను చూసినప్పుడు కలిగే గౌరవనీయమైన భావం చెప్పనలవికాదు. . జ్ఞాన బంఢాగారముగా, విద్యలకే కాదు, విధ్యార్థులను ఉన్నతమైన విలువలు గల మానవులుగా మార్చి, వారిలో ఒక వ్యక్తిత్వం నెలకొల్పి, యువతకు జీవితంలో విజయానికి సోపాన మార్గాలు. అందుకే ప్రపంచ ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలు దర్శనీయ ప్రదేశాలే మరి!. అందునా అమెరికాలో విశ్వవిద్యాలయాలు ప్రపంచములో ప్రథమ స్థానములో నిలబడి వాటి ఘనత చాటుతాయి. నాకు అలా స్టాంఫోర్డ్ చూడటం చాలా గొప్ప అనుభూతిని కలిగించిన విషయం…
katte pongali
మరో రోజు ప్రారంభం, తప్పదు మనకు వంటింటి తో సహవాసం. ఇంత పెద్ద వంటగది పెట్టుకున్నది మరి అందుకే జంజాటము… వంటింట్లో ఉండటం తప్పదు, అటు – ఇటు గిరగిరా తిరగలిలా తిరగటమూ తప్పదూ. గడబిడి లేకుండా ఆ మూల నుంచి ఈ మూలకూ తిరిగితే కొంత వర్కౌట్, సందులో సడేమియాలా కాస్త కమ్మనివి వండవచ్చు! ఫ్రైడే (శుక్రవారము) వచ్చింది. థాంక్స్ గాడ్ ఇత్స్ ఫ్రైడే(ThankGod Its Friday) అనటానికి లేదు. ఈ రోజు మరింత పని,…
Akakarakai pulusu
తెల్లారింది మొదలు మానవులకు తిండిగోల తప్ప మరోటుండదా అని దిగులేస్తుంది ఒక్కోసారి. ఈ ఉదయము శ్రీవారు నాతో “టిఫెను పెట్టు ఆఫీసుకెళ్ళోస్తా’ అన్నాడు. ఈ చద్దిపెట్టె( ఇలా అనమని మిత్రులు సలహలిచ్చారుగా) లో భద్రంగా వున్నాయి పూరీ కూరా తినెయ్యరాదూ’ అని అర్థించాను. “ఏ యూగాలనాటివి అవి” “త్రేతాయగమనుకుంటా’ “అయితే ఆర్కేయాలజీ వారికి పంపు… నాకు మాత్రం ఎదైనా టిఫిను పెట్టు’ అన్నాడు షార్పుగా. ఈ ఉదయమే ఓ ఉప్మా కథ చదివారు. అది గుర్తుతెచ్చుకుంటూ ‘ఆఫీసుకు…
tomato chutney
ఈ రోజు శీతన వస్తు సముదాయ భద్రతా భరిణ (ఫ్రిజ్)లో చూస్తే చెర్రీ టమోటో లు చాలా వుండిపోయాయి. వాటిని సలాడు లో వాడుదామని తెచ్చాను. నేను రాత్రి పగలు తిన్నా మిగిలిపోయి పాడయిపోతాయని దిగులేసి ఫాస్టుట్రాకు లో వాడటానికి ఏకైక మార్గంగా పచ్చడి లాంటి ఊరగాయ ఒకటి చేశాను. ఈ రెసిపీ నాకు హైద్రాబాదులో మా వంటమనిషిగారు చెప్పారు. ఆమె అలా చెకచెక చాలానే చెప్పేవారు. అందుకున్నవారికి అందినంత. నాకు తోచినన్ని రాసుకున్నాను. అలా ఈ…
వంటిల్లు
వంటగది ప్రతి గృహానికి గుండెకాయ వంటిదంటారు. ఆహారము అక్కడే కదా తయారయ్యేది. ఆ ఆహారము మానవులకు ప్రాణము నిలుపుటకు ఇందనము ఆ జాగ్రత్త. కాబట్టి వంటగది పరిశుబ్రము చాలా ముఖ్యము. పరిశుభ్రము ఎంత ముఖ్యమో, చేతికి అందుబాటులో వస్తువుల అమరిక అంతే ముఖ్యము. అందునా నేటి జీవన విధానములో మనము గంటల కొద్ది సమయము అక్కడ గడపలేము కదండి. అందుకే నేటి మాడ్యూలర్ వంటిల్లు వచ్చింది. ఈ టైపు వంటగదిలో పొయ్యి, సింకు , ఫ్రిజ్ లను…
నేనూ నాన్న
నాన్నగారు వచ్చే ముందు గదిలోకి విభూతి సువాసనలు వస్తాయి . తరువాత ఆయన వస్తారు. ఆయన గురించి తలుచుకుంటే చాలా మిక్సడ్ ఫీలింగ్సు కలుగుతాయి. ఆయన భోళా శంకరులు. అవి వీర భక్తులు. అగ్నిహోత్రానధానులకు అన్న వంటి వారు. హృదయము చూస్తే నవనీతము. అందరిని కలుపుకు పోయే తత్వం. ప్రతివారికి కాదనకుండా సాయము చేసే గుణం. బంధు ప్రీతి. వేదములంటే వీపరీతమైన భక్తి. ఉదయము పూజ కానీదే మంచినీరు కూడా తాకరు. అంత నిష్ఠ. అన్నింటికి మించి…
నా కోతికొమ్మచ్చి -10
పుస్తకాలు – పుస్తకాలు అమ్మ గుంటూరులో పెరిగింది. తను పాపం 8 వ తరగతిలో వుండగానే పెళ్ళి చెసేశారు తాతగారు. ఆమె పెళ్ళి అయినా చదవు కొనసాగించింది. హింది విశారద పూర్తి చేసింది. ఓపెను యూనివర్సిటి పెట్టాక అందులో బియే పూర్తి చేసింది. ఆమె గుంటూరులో చదివిన స్కూలు కాన్మెంతటు బడి. ఇంగ్లీష్ మీడియం లో చదివింది. చాలా చదివేది ఆవిడ. ఎప్పుడూ ఒక పుస్తకము చేతి లో వుండాల్సిందే. ఎన్నో చదివి ఎక్కడెక్కడి వింతలూ మాకు…
నా కోతికొమ్మచ్చి -9
నా సంగీతము – నానా యాతన నా మొదటి సంగీత గురువు అమ్మనే! అమ్మ సంగీతం నేర్చుకుంది. చక్కటి త్యాగరాజ కృతులు పాడేది. అమ్మమ్మ ఇంట్లో అమ్మమ్మకి, అమ్మకి , పిన్నికి సంగీతం వచ్చు. అమ్మమ్మ ఫిడేలు వాయించేది. పిన్ని వీణ, అమ్మ మాత్రం గాత్రమే పాడేది. అదేంటి అమ్మా అంటే, పాటలు ఎక్కడైనా హాయిగా పాడుకోవచ్చును. అదే ఇన్సర్టుమెంట్ అయితే మోసుకు పోవాలి అని” అని చెప్పి నవ్వేసేది. సన్నని కంఠం తో అమ్మ పాడుతూ…