“మీరు చదివిన స్కూలును మళ్ళీ ఎప్పుడైనా విజిట్ చేశారా?” అని ఒక చోట యండమూరి పశ్నిస్తారు. అవును మనము గతం మీద ఎంత భవిష్యతు సౌధాలు నిర్మించినా… వర్తమాన సమతుల్యం పాటించినా అలాంటి చిన్న చిన్న పనులు మన హృదయం లోలోపలి తేమను పైకి తెచ్చి, మనలోని మానవత్వపు మొక్కకున్న పూల సువాసన వెదజల్లుతాయి. ఆ ఆనందముతో మనము మరి కొన్ని సంతోషకరమైన రోజులు గడపొచ్చు. అలాంటి కొన్ని బ్రతికిన క్షణాల వివరాలు…. మా నాన్నగారి రెవెన్యూ…
Author: ఉహలు- ఊసులు - సంధ్య
అంతరంగము
నీకోసం, నాకోసం కోసుకునే బ్రతుకు నేను… నీ కంటి కి రెప్పనైనా… నా కంటి చూపువై నీవు వెలిగినా నీకు నాకు మధ్య దూరం అనంతమై నిలిచి వికట్టాటహాసం చేస్తోంది,… నిలువునా చీలిన రే- పగళ్ళ నిశీధికి ఇది సంతకమా నేస్తం ! బాహ్యాంతరాలను విడచి మనగలమా? మౌనమే భాష్యమై చరిత్రలో మిగిలిపోవటం అన్నిటికన్నా అత్యుత్తమం …. చూసావా మౌనంలోనూ నీ సంతకము అగుపిస్తోంది…. నిలబడకలనా? మనకలనా? ఇలా… లహరికి నిలకడలేదు, మనసుకు మౌనం రాదు అందుకే…
బదిరి చరిత్ర వివరములు
బదిరి చరిత్ర వివరములు: కేదార ఖండములో, నర నారాయణ పర్వతాల మధ్య, వెలసిన తపోభూమి బదరి. ఆ క్షేత్రానికి ‘నారద క్షేత్రం’ మంటారు. అంటే నారదులవారు అక్కడ ఆరు నెలలు వుండి స్వయంగా నారాయణ సేవ చేయుకుంటారుట. ‘నరనారాయణ’ పర్వతాలకు వున్న చరిత్ర: పూర్వం సహస్ర కవచుడన్న రాక్షసుడు బ్రహ్మ వరమున ప్రజలను పీడిస్తున్న నారాయణుడు ఆ అందమైన క్షేత్రాన మొట్టమొదట కాలు పెట్టాడు. ఆయన మొదట కాలు పెట్టిన చోటును ‘చరణపాదు’కలంటారు. అక్కడ పాద ముద్రలు…
బదిరికి చేరిన విధంబెట్టిదనిన:
బదిరికి చేరిన విధంబెట్టిదనిన: బదిరిలో వుండి కొంత జపం చేసుకోవాలన్న నా కోరిక పూరతనమైనది. అంటే – అనాదిదేమీకాదు గానీ నాకు బదిరి మొదట(2016లో) రాఘవ స్వామి చెప్పి చెప్పిన నాటి నుంచి నాలో మొలకెత్తి నేటికి సాకరమైనది. ఏదైనా జపము, తపము, హోమము, దానము….మంచి కానీ చెడు కానీ ఒకటికి 100 రెట్ల ఫలము బదిరిలో లభ్యం. అది నారాయణుడు ఇచ్చిన మాట. ఉత్తరాచల రాష్ట్ర మంతా తమది దేవభూము యని ప్రకటించు కుంటారు. హిమాలయములంతా…
హిమాలయములు!!
హిమాలయములు అద్భుత సౌందర్య సంపదల నిలయమా , అనిర్వచ ఆనందాలు పండించు శికర సమూహమై, రాశిభూతమైన సర్వ సంపదలభౌతిక రూపమై, మురిసితివి నీవు హరునకు ప్రియమైన ఆవాసమై, జగములనేలు జగదంబ పుట్టినిలై, హరికి మిగుల ప్రాణమై, బదిరికా వనమై, మహోన్నత ఉత్తుంగ తురంగ తరంగమై సురగంగ నృత్యాల వేదికై, యక్ష గంధర్వ కిన్నెర కింపురుషులకు ఆలవాలమై, పవిత్ర జలముల మేటి సెలయేటిల కంజారమై, హొయలు మీర సొగసు చూపు జలపాతముల సంవాసమై, ఆధ్యాత్మికతను పండించిన భూమికై మహా…
బ్రహ్మకపాలము
బ్రహ్మకపాలము :: బ్రహ్మకపాలం గురించి అంతా వినే వుంటారు. నాకు తెలిసినంత వరకూ దాని గురించిన కథ ఈ విధంగా సాగుతుంది. పూర్వం బ్రహ్మ గారికి ఐదు తలలుండేవిట. ఏదో విషయములో ఆయన రుద్రునితో విభేదించటం, మహాదేవుడు తన చిటికనవేలుతో తల కొట్టేయ్యటం జరిగాయి. తెగిన తల రుద్రునికి గోరుకు అంటుకుపోయ్యింది. బ్రహ్మ హత్యా దోషము కూడా తోడైయ్యింది. బ్రహ్మగారి తల కపాలంలా కూడా మారింది. రుద్రుడు ఆ కపాలంతో బిక్ష చెయ్యటం కూడా చేసాడుట. ఆయనకు…
‘మనా’ భారత చిట్టచివరి గ్రామము!!
‘మనా’ లో ఒక రోజు. భారత దేశపు చిట్టచివరి గ్రామము “మనా” ను సందర్శించే అవకాశము నేను బదిరికి వెళ్ళిన రెండో రోజు కలిగింది. బదిరిలో నేను వున్న ఆశ్రమ సిబ్బంది నాతో ఎంతో ప్రేమగా వారి సొంత కుటుంబ సభ్యులలా ఆదరించారు. నే వెళ్ళిన తరువాత రెండోనాడు దేవాలయం నుంచి మధ్యహానము వేళకు నేను ఆశ్రమము చేరగానే శ్రీదరు (అక్కడి కేర్టేకరు) మనము ఈ రోజు మనా వెడుతున్నాము అన్నాడు. నే సరే యని భోం…
Nealkant
హిమ పర్వత శిఖరాల అందం! వర్ణించటం ఎవరికైనా అసాధ్యం !! కొంత సోయగాలు కొంత ముదిత తనాల… నీలకమల మందు ప్రత్యేకం (NelKant name of the mountain at Badrinath) సదా నాతో దోబూచులాడుతునే వుంది ముబ్రుల తెరలు వీడక ముసుగేసుకుంటుంది చాలా కాలము. పెద్దచేప వెంటుండే చిన్న చేపలలా మబ్బులు సదా ఆ పర్వతాని తాకి వేలాడుతునే వుంటాయి. కొత్తగా పెళ్ళయిన భర్త భార్య ను పట్టుకు వదలనట్టు వెళ్ళాడుతునే వుంటాయి. ఎదో ఒక…
నమో గంగా నమో నమః
గంగా నమో నమః!! ఆకాశమునుంచి పరమ శివుని శిరసు మీదకురకంగా గలగలా పరవశముగ మని పారంగా శిఖిఫించుని పాదములను బదిరిలో కడగంగా పంచ ప్రయాగలను పవిత్రంగా కలపంగా హరి హరియని తలవంగా హరిద్వారమున హారతులను అతిశయముగ అందుకొని మురవంగా ఆదరంగా ఆ గంగా మనమున నమ్మి మునగంగా పాపము బాయును ఆదరంగా వాగులు వంకలు వచ్చి కలవంగా హెచ్చుగ నాగరికత విరవంగా చరిత్రను దర్పణంగా చూపంగా జీవాధారమై నడవంగా ఆనందాలుగ మానవాళి మురియంగా.. మన గంగా!! కాశీ…
వరుసలే ముద్దు – తోపుడు వద్దు!!
మా చిన్నప్పుడు తెలంగాణాలో వున్న మా వూరి నుంచి కేవలం బస్సులు మాత్రమే లభ్యం. అందుకే బస్సులలో ఎక్కువగా ప్రయాణం చెసేవాళ్ళం. అప్పుడు అదొక ప్రహసనంలా సాగేది. దిగేవారిని దిగనీయ్యకపోవటం, ఎక్కేవారిని అడ్డుకొనటం. ఒకళ్ళను ఒకరు తోసెయ్యటం. కిటికీలు పట్టుకు వేలాడటం. దస్తీ వేసో, టవలు పర్చో… సీటు రిజర్వు చెయ్యటం, ఒకటేమిటి….తోసుకు వెళ్ళేవాడు తోపు…… లైను కట్టక కట్ చెయ్యువాడు వీరుడు…ఇలా ….ఒక రేంజు… వుండేవి బల పదర్శనలు. ఈ తోసుడు వుంది చూడండి బుద్ది…