ఒక్క వంకాయతో వంద కూరలు చెయ్యవచ్చని మొన్నెవరో చెప్పారు.
అవును! నిజం!!
వంకాయ వుంటే అన్ని వున్నట్లే.
వంకాయతో
వందరకాలలో వంకాయ అన్నము కూడా వుంది. అదే వాంగీబాద్.
ఇది కన్నడిగుల వంట.
చాలా సులువు. రుచికి రుచి.
సులువు అయి, మనకు బోలెడు సమయం మిగిల్చే ఈ వాంగీబాద్ తో నా ప్రాణాలు కుదుటపడ్టాయి. త్వరగా వండేసి చదువుతున్న పుస్తకము పూర్తి చేశాను. అందుకే.
సరే రెసిపి చకచకా చెబుతాను. లేతే మళ్ళీ రెసిపీ అంటూ అడుగుతారు నెచ్చెలులు.
వంకాయలు ఆరు. వుల్లిపాయ ఒకటి
పచ్చిమిరపకాయులు నాలుగు
మిక్సుడు వెజీ (బఠాణి, క్యారెటు, బీన్స్) ఒక కప్పు.
ముందుగా రెండు కప్పుల అన్నము వండాలి విడిగా.
బాండిలో నూనె వేసి తరిగిన కూరగాయలు వెంచాలి. మూత పెడితే వంకాయ మెత్తబడుతుంది.
దానికి పసుపు, ఉప్పు, కారం, కరియేపాకు, ఇంగువ, ధనియాల పొడి, వంగీబాదు మసాల మూడు చెంచాలు కలపాలి. వాటికే చిన్న చెంచా బెల్లం, కొద్దిగా చింతపండు నీరు కలిపి, వుడకనివ్వాలి. వుడికిన కూరగాయలకు అన్నం కలపి కొద్దిగా నెయ్యి పైన వేసి కలుపుకోవాలి. దీనికి కొద్దిగా కొత్తిమీర చల్లి రైతా తో కలిపి వేడివేడిగా వడ్డించాలి.
వాంగీబాదు మసాలాకు కావలసినవి:
శనగపప్పు 1/2కప్పు
మినపపప్పు 1/2కప్పు
సమాన తొలత
ఎండు కొబ్బరి 1/4
ఎండు మిరప 6
1 చెంచా మిరియాలు,
1 చెంచా లవంగాలు , ఏలకులు, దాల్చనచెక్క ఒక ముక్క
గసగసాలు 1 చెంచా
ఇవ్వన్నీ డ్రైగా వేయ్యించుకు పొడి కొట్టాలి. ఈ పొడి నిలవ వుంటుంది. ఒక సారి చేసుకుంటే మూడు సార్ల వాడుకోవచ్చు.