Day1 మొదటి రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరీ అవతారంగా సేవించాలి.ఈశ్వరుడి భార్య అయిన గౌరిదేవే త్రిపురసుందరి. మానవుల ‘మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం’ బాల త్రిపుర సుందరిదేవి ఆధీనంలో ఉంటాయి.అభయ హస్త ముద్రతో, అక్షరమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోతాయి. విద్యను, జ్ఞానాన్ని ఇచ్చి రక్షించే బాల పరమ కరుణామయి. ఈ తల్లిని ఆరాధిస్తే నిత్య సంతోషం కలుగుతుంది. త్రిపుర సుందరిదేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షోడశ విద్యకు ఈ…
Author: ఉహలు- ఊసులు - సంధ్య
రాధాష్టమి
ఈ భాద్రపద శుద్ధ అష్టమి రాధారాణి జన్మాష్టామి. బృందావనవాసులకే కాదు సర్వ జనులకు పండుగరోజే. కృష్టాష్టమి ఎంత వేడుకో, అంతకుమించి పండుగ ఈ రోజు. కృష్ణుని ప్రియురాలని తలచే ఈ రాధారాణికి ఎందుకింత ప్రాముఖ్యత? అని ఆలోచన కలిగితే, ఆమె గురించి విచారిస్తే, తరచి చూస్తే మూలప్రకృతిగా, శక్తి స్వరూపిణిగా రాధారాణి మనకు కనపడుతుంది. రాధను తిప్పి రాస్తే ధార అవుతుంది. నిరంతరాయంగా అంటే ధారగా కురిసే కరుణ, ప్రేమ, అనురాగం, దయకు గుర్తు రాధ….
రామాయణం సుందరకాండ
సుందరే సుందరో రామః, సుందరే సుందరీ కథా| సుందరే సుందరీ సీతా, సుందరే సుందరం వనమ్ ||సుందరే సుందరం కావ్యం, సుందరే సుందరం కపిః |సుందరే సుందరం మంత్రం, సుందరే కిం న సుందరమ్||సుందరకాండ గురించి చెప్పిన మాట ఇది. ఏమిటీ సుందరం? అని సందేహ పడే జీవులకు“నష్టద్రవ్యస్య లాభోహి సుందరః పరికీర్తితః” పోయిన వస్తువు దొరికితే కలిగే ఆనందం సుందరం. పోయినది సీతమ్మే కాదు, సీతకు రాముడి జాడ కూడా తెలిసిందీ కాండలోఅందుకే సుందర కాండ పారాయణంతో దుఃఖం…
శేఫాలికలు
మంచి పుస్తకాలు పాఠకుల మనస్సులను కస్తూరి సువాసనలా మత్తెకిస్తాయి. చదివిన తరువాత ఎన్నో సంవత్సరాలు తోడుంటాయి.గమ్యం సూచిస్తాయి. జ్ఞానదీపికలవుతాయి. అటు వంటి పుస్తకాలను గురించి చెప్పాలంటే ఎక్కువగా పుస్తకాలు చదివేవారికి ఎన్నో ఉంటాయి. అలాంటి పుస్తకాలను పరిచయం చేశారు రచయిత్రి వీరలక్ష్మీదేవిగారి తన శేఫాలికలో. శేఫాలిక అంటే పారిజాతాలట. పారిజాతం దేవపుష్పం. చెట్టు మీదుంటే మనం కొయ్యలేము. పూర్తిగా విచ్చుకొనిదానంతట అదే, రాత్రి మంచు పరచుకున్న వసుధను కౌగిలించుకుంటుంది. మన ఉదయాలను సుగంధభరితం చేస్తుంది. సున్నితమైన పారిజాత కదంబం వీరి శేఫాలికలు. అసలు…
భగవాను అడుగుజాడలలో
మంచి పుస్తకాలు చాలా అరుదుగా దొరుకుతాయి. అవి దొరికినప్పుడు, వాటిని చదివాక గొప్ప సంతోషం కలుగుతుంది. అది మనకు భగవద్గీతలా దారి చూపేదైతే, ఆ రసానందం గురించి ఇక చెప్పనక్కర్లేదు కదా!!అలాంటి గ్రంధం గురించే ఈ వ్యాసం. ఈ పుస్తకం ప్రతి సాధకుడూ చదవవలసినది. ప్రతి ఉపాసకుడూ చదవవలసినది. ప్రతి అద్వైతి కూడా తప్పక చదవవలసినది. ప్రతి మానవుడూ కూడా తప్పక చదవవలసినది. ఆ గ్రంధం “Living by the words of Bhagawan” అన్న ఆంగ్ల గ్రంధానికి తెలుగు అనువాదం…
నే చదినిన పుస్తకం
ఈ మధ్య కాలములో నే చదివిన పుస్తకాలలో చాలా మటుకు సాధనకు పనికివచ్చేవే అని చెప్పలేను. కొన్ని మాములు పుస్తకాలు… కొన్ని కథలు…కాని ఈ పుస్తకం అలా ఏ కోవకూ చెందనిదిగా చెప్పాలి. ఎందుకంటే ఇది రమణభక్తురాలి కథ అయినా, ఆమె భగవానుతో తన అనుబంధం గురించి కానీ, సాధన గురించి గానీ ఈ పుస్తకంలో వివరించినది పెద్దగా ఏమీ లేదు. కాని రమణాశ్రమం, ఆనాటి స్థితిగతులు, ఆశ్రమం ఎలా వృద్ధి చెందింది, ఏ ఏ ప్రముఖులు…
గురుమండలం
గురువు – గురుమండలము గురు మండలము సూక్ష్మలోకంలో ఉంటుంది. మనకు కనపడుతున్న భౌతిక ప్రపంచము మాత్రమే ప్రపంచమని తలవటమే అజ్ణానము. మనకు కనపడేది కేవలం1/7 భాగము. మనకు కనపడని విశ్వం అనంతం. ఇంతటి విశ్వంలో పెనుచీకటికి ఆవల ఉన్న ఈశ్వరుడ్ని ఎలా పొందగలము?దానికే మనకు గురువును సహాయం కావాలి. అంతేనా అంటే కాదు గురువు ఈశ్వరుడై జీవుని/సాధకుని వేదన తగ్గిస్తాడు. ఈశ్వర ప్రభతో వెలిగే గురుదేవులు జీవుడి వేదన తగ్గించి అంతర్మఖమై స్వాత్మను తెలుసుకోవటానికి సహయపడతాడు. అందుకే గురువు అవసరం ప్రతి ఒక్కరికీ ఉంటుంది….
మాఘ నవరాత్రులు
మాఘమాసం అద్భుతమైన కాలం. ఉత్తరాయణ పుణ్యకాలం మొదట వచ్చే ఈ మాసం పుణ్యకాలం.అప్పటి వరకూ ఆగిన ముహుర్తాలు మాఘమాసంతో మొదలవుతాయి. నదీ స్నానానికి, సముద్రస్నానానికి ప్రసిద్ధి ఈ మాసం.మాఘమాసంలో సూర్యారాధన ఎంతో ముఖ్యమైనది. ఈ మాసంలోనే మనకు రథసప్తమి కూడా వస్తుంది.ఇదే కాక ఈ మాసంలో జ్ఞానాన్ని ఇచ్చే శ్యామలా నవరాత్రులు కూడా వస్తాయి.ఈ మాఘ శుక్ల పాడ్యమి నుంచి శుక్ల నవమి వరకూ కూడా రాజ్యశ్యామలా నవరాత్రులుగా ప్రసిద్ధి. ఇవి గుప్త నవరాత్రులు. ఈ గుప్త…
New year
జరిగిన కాలం జారిన నీరు. తిరిగి పట్టలేవుఒడసి త్రాగలేము. జరిగిన యేడుఇచ్చిన అనుభవంనిన్నుగా నిలపటానికినీలోకి చూడటానికిచేసినదెంత?చూసినదెంత?నీ ప్రక్కవారి తప్పులను(నీ హ్రస్వదృష్టికి)ఎగిరెగిరి చూసే నీవుకనపడని డప్పేసుకున్నమ్రోగుత్తున తోలుతుత్తి నీవు నీవైపు చూసుకొనినీవేమిటన్నది గ్రహించేందికు చాలదీ జన్మంజుట్టుకు రంగులద్దుకు…నీ అసలురూపుకు రంగులద్దిలోకాన్ని మురిపిస్తున్నాననినిన్నునీవు మభ్యపరుస్తున్నావు. ఇకనైనా జరిగిక కాలాన్నిగౌరవంగా స్వీకరించి…శరీరానికి వచ్చిన వయస్సునుహుందాగా స్వాగతించిఈ యేడైనా…నిన్నునిన్నుగా గౌరవించుకో…ఆత్మగౌరవపు అర్థం గ్రహించు….
కృష్ణతత్త్వం
కృష్ణస్తు భగవాన్ స్వయమ్’… కృష్ణుడే పరమతత్త్వం… చరమ లక్ష్యం.. ఏ పరతత్త్వమును వివరించటానికి భాష చాలదో… సర్వ భాషలకు అందని మౌనములో తప్ప అర్థం మనకు తెలియదో…కేవలం ప్రేమ ద్వారా మాత్రమే అందుకోగలరో ఆ పరతత్త్వమే శ్రీకృష్ణ తత్త్వము. కృష్ణుడు ఒక యుగానికి చెందినవాడనో, లేక,చరిత్రలోనో, పురాణాలలోనో, కావ్యాలలోనో చదివే నాయకుడనుకోవటం అజ్ఞానానికి గుర్తు. శ్రీ కృష్ణుడు సర్వత్రా వ్యాపించిన పరతత్వమే. మనము ఎలా అర్థం చేసుకుంటే అలా అర్థమవుతూ, ఇంకా తెలుసుకోవలసినది ఎంతో మిగిలి ఉండటమే కృష్ణతత్త్వము. …